భారీ చోరీ కేసు ను ఛేదించిన పేట రూరల్ పోలీసులు..

రూ. 33.50 లక్షల సొత్తు స్వాధీనం.

చిలకలూరిపేట రూరల్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 33.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు చోరీ కేసులను ఛేదించినట్లు పల్నాడు జిల్లా పోలీసులు వెల్లడించారు.చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామంలో జరిగిన ఓ ఇంట్లో చోరీ కేసును ఛేదించడంలో రూరల్ పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో 380 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 33,50,000 ఉంటుందని అంచనా.ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్సై అనిల్‌లను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.

Share.
Leave A Reply