Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేటలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన – బంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. చిలకలూరిపేట:అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందనే ప్రచారం చిలకలూరిపేట నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ కొరత భారీగా ఉండబోతుందనే వార్తలతో పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు.ప్రస్తుత పరిస్థితి:

Read More

52 ఎకరాల టిడ్కో హౌసింగ్ కాలనీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు – సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేట: లోకకళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుని జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిలకలూరిపేట పరిధిలోని 52 ఎకరాల టిడ్కో (TIDCO) గృహ సముదాయంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించ తలపెట్టాము. ఈ సందర్భంగా చిలకలూరిపేట కూటమి నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ, టిడ్కో నివాసితులందరి సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతాయని తెలిపారు కార్యక్రమ వివరాలు ముఖ్య ఉద్దేశ్యం: రామరాజ్య స్థాపనే లక్ష్యంగా, ప్రజలందరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి మరియు టిడ్కో లబ్ధిదారులందరిలో ఐక్యతను చాటడానికి ఈ వేడుకలను నిర్వహిస్తున్నాము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా టిడ్కో కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రుని కృపకు…

Read More

ఉద్యాన పంటలతోనే అధిక ఆదాయం : ప్రత్తిపాటి ప్రతి ఎకరాకు అధిక దిగుబడి. ప్రతి రైతుకు మంచి లాభం రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయానికి, పాడిపోషణకు ప్రభుత్వాలు అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకొని, తమ జీవనప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. రైతన్నా మీకోసం – అన్నదాతా సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం వేలూరు, యడ్లపాడు మండలం సందెపూడి గ్రామాల్లో వ్యవసాయవిభాగం నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రత్తిపాటి పాల్గొన్నారు. వేలూరులో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి, సందెపూడిలో రూ30 లక్షలతో నిర్మించ తలపెట్టిన సామాజిక భవనం (కమ్యూనిటీ హాల్), రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు, డ్రైన్లకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రెండు గ్రామాల్లోనూ పలువురు రైతుల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వవిధివిధానాలు, నూతనసాగు పద్ధతులను ప్రత్తిపాటి అన్నదాతలకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన గ్రామసభల్లో మాట్లాడారు.…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా గారికి రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన సంచార జాతుల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం క్రోసూరు మండలంలో ప్రధాన సమస్య అయినటువంటి మరుగుదొడ్లు మరియు పంట కాలవల మెయింటినెన్స్ గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు క్రోసూరు మండల బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్లజిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,పల్నాడు జిల్లా విషయం: రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల…

Read More

బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానంయషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవిందు శంకర శ్రీనివాసన్ తన మనవరాలు యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవిందు శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట సత్య సాయి కిరణ్ మరియు డాక్టర్ గోవిందు తేజస్విని దంపతుల కుమార్తె అయిన యషిక క్షేత్ర పుట్టినరోజును గౌరవ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధుల ఆశీస్సులు చిన్నారి భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.…

Read More

బొప్పూడి నక్షత్ర వనంలో హైకోర్టు న్యాయమూర్తి మొక్కలు నాటే కార్యక్రమం ​చిలకలూరిపేట (బొప్పూడి):పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలమని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ బొప్పూడి కృష్ణమోహన్ గారు పేర్కొన్నారు. శనివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని “నక్షత్ర వనము”ను ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు.​ఈ సందర్భంగా నక్షత్ర వనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వగ్రామంపై మమకారంతో పాటు, పర్యావరణం పట్ల ఇక్కడి ప్రజలు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. నక్షత్ర వనం వంటి ఆధ్యాత్మిక మరియు పర్యావరణ మేళవింపు ఉన్న ప్రాంతాలు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read More

వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి: మురికిపూడి ప్రసాద్ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర సమాలోచనలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు వినియోగదారులను మభ్యపెట్టి అధిక ధరలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటిని కమర్షియల్‌గా విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారులకు సరఫరా చేసే ప్రతి గ్యాస్ సిలిండర్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను గుర్తించి, వినియోగదారుడు తన పుస్తకంలో నమోదు చేసుకోవడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించవచ్చని సూచించారు. ఈ విధానం గతంలో ప్రభుత్వాలు…

Read More

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన జాతీయ కార్యదర్శిగా నియమితులైన సింగరేసు పోలయ్య . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా సింగరేసు పోలయ్య తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరేసు పోలయ్య. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య. అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన సింగరేసు పోలయ్య. సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా…

Read More

గెలుపు ఓటములకు అతీతంగా ప్రజలకోసం పోరాడే పార్టీ టీడీపీ: ప్రత్తిపాటిచిలకలూరిపేట పట్టణం నుంచి గెలుపొందిన టీడీపీ కౌన్సిలర్లు అందరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజాభిమానం…ఆదరణ పొందిన నాయకులను వారు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణం నుంచి తెలుగుదేశం కౌన్సిలర్లుగా గెలుపొంది, ప్రస్తుతం పదవీకాలం పూర్తయిన వారికి ఉగాది పండుగను పురస్కరించుకొని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదవులకు అతీతంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకై సమిష్టిగా పనిచేయండి..పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చినప్పటికీ, కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారంలో మునుపటిలానే సమర్థంగా పనిచేయాలని, 5, 6 నెలల్లో రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. టీడీపీ తరుపున గెలిచి, గత ప్రభుత్వంలో నాటి పాలకుల అరాచకాలపై కౌన్సిలర్లు…

Read More

పల్నాడు లో యువతి కిడ్నాప్ కలకలం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామ సమీపంలో యువతి కిడ్నాప్ కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. నరసరావుపేటలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో పనిచేసే యువతి, పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కిడ్నప్ కు గురైనట్లుసమాచారం . ​​ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఉయ్యాల చైతన్య 22 బాధితురాలు ప్రతిరోజూ నరసరావుపేట వెళ్లి తన పని ముగించుకుని సాయంత్రం వేళల్లో తిరిగి గ్రామానికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే, రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలోకి రాగానే యువతి కిడ్నాప్ కు గురైనట్లు సమాచారం ,.​యువతి ఇంటికి చేరుకోకపోవడం మరియు స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన రొంపిచర్ల పోలీస్ ​ఘటనా స్థలాన్ని పరిశీలించి, తుంగపాడు – నరసరావుపేట మార్గంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు రొంపిచర్ల పోలీసులు ​నిందితులు ఏ దిశగా వెళ్లారనే కోణంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు పూర్తి…

Read More