పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారాధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధార గుప్తా గారు పల్నాడు జిల్లా జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
మహారాజశ్రీ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అధికారి గారి దివ్యసముఖమునకు వ్రాసుకున్న అర్జీ
విషయం: నైపుణ్యం పెంచండి… నిరుద్యోగం తగ్గించండి
రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి, స్థానిక ఉద్యోగాలు, చేతివృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయవలెనని వినతి
“మీ సమస్య… మా బాధ్యత” అనే భరోసా తో భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయాల్లో ప్రజల సమస్యలను స్వీకరిస్తూ, గ్రామాలు–నగరాల్లో పర్యటిస్తూ ప్రజల ఆకాంక్షలను తెలుసుకుంటున్నాము. ఇటీవల భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా యువతను కలసి వారి సమస్యలు, ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుంది. ఈ కార్యక్రమాల్లో SC, ST, OBC, మహిళలు, చేతివృత్తిదారులు, నైపుణ్య శిక్షణలో ఉన్నవారు, నిరుద్యోగులు, చిన్న చదువులతో సరైన జీవన మార్గం తెలియని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు “జిల్లాకో నైపుణ్య కేంద్రం” ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ ప్రణాళికలు కేవలం సమావేశాలు, నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించేలా అమలు కావాల్సిన అవసరం ఉందని అధికారులు ఆ దిశగా ఆలోచించాలి అని మనవి చేస్తున్నాము. రాష్ట్రంలో యువత నుంచి వస్తున్న వినతుల్లో గణనీయమైన వాటా ఉద్యోగాల కోసమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది; ఇది తక్షణ చర్యలు అవసరమని సూచిస్తోంది
కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చి, Skill India Mission, PMKVY 4.0, PM-NAPS, Jan Shikshan Sansthan, PM Vishwakarma, Digital India, Startup India, Mudra, Stand Up India, PM-SETU వంటి అనేక పథకాల ద్వారా యువతకు, చేతివృత్తిదారులకు, స్వయం ఉపాధి ఆశావహులకు శిక్షణ, మద్దతు, రుణాలు, టూల్‌కిట్లు, పరిశ్రమల అనుసంధానం వంటి అవకాశాలు కల్పిస్తోంది. ఈ అవకాశాలు రాష్ట్రంలో సమర్థవంతంగా వినియోగించబడితే లక్షలాది కుటుంబాలకు ఉపయుక్తం అవుతాయి
అయితే, యువత నుంచి మాకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం, పథకాలు ఉన్నప్పటికీ పరిశ్రమలకు సరిపోయే నైపుణ్యం కొరతగా ఉంది; శిక్షణ ఒకటి, పరిశ్రమల అవసరం మరోటి అన్న పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్ ఉన్నా ప్రాక్టికల్ స్కిల్ లేకపోవడం, ప్లేస్‌మెంట్‌పై తక్కువ దృష్టి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం పేరుతో ఉన్న నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, స్కూల్ స్థాయి నుంచే vocational education బలహీనంగా ఉండటం, తక్కువ జీతాలు, నైపుణ్యం ఉన్నవారి వలసలు, చేతివృత్తుల పట్ల నిర్లక్ష్యం, డేటా ట్రాకింగ్ లోపం వంటి సమస్యలు తీవ్రమైనవిగా గుర్తించాము. రాష్ట్రంలో ఇటీవల జిల్లాకో నైపుణ్య ప్రణాళిక, పరిశ్రమలకు అనుగుణ శిక్షణ, టెన్త్ విద్యార్థుల ట్రాకింగ్ వంటి అంశాలపై చర్యలు ప్రారంభమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ, అవి వేగంగా మరియు సమగ్రంగా అమలు కావాల్సిన అవసరం ఉంది
కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కింది అంశాలను అత్యంత ప్రాధాన్యంతో పరిగణనలోకి తీసుకుని వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మనవి చేస్తున్నాము
ప్రతి జిల్లాలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా Skill Map తయారు చేయాలి. పోర్టు, ఐటీ, షిప్పింగ్, ఆటోమొబైల్, సోలార్, మైనింగ్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఆయిల్ & గ్యాస్, అక్వా, ఫిషరీస్, పేపర్, అగ్రో రంగాలకు సరిపడే శిక్షణ మాడ్యూల్స్ రూపొందించాలి. మండల స్థాయిలో Skill Centers ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు సులభంగా చేరువ చేయాలి. SC, ST, BC, మహిళలు, డ్రాప్‌అవుట్స్, చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక స్కిల్ ప్యాకేజీలు అమలు చేయాలి. శిక్షణతో పాటు placement or loan అనే మోడల్‌ను పటిష్టంగా అమలు చేయాలి. ప్రతి MoUలో ఉద్యోగాల సంఖ్య, శిక్షణ లబ్ధిదారుల సంఖ్య, నియామకాల లక్ష్యాలు స్పష్టంగా ప్రకటించాలి. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగ, శిక్షణ సమాచారం నిరంతరం ప్రచారం చేయాలి. vocational education ను స్కూల్ స్థాయి నుంచే బలోపేతం చేయాలి. తక్కువ చదువు ఉన్న యువత, డ్రాప్‌అవుట్స్, సంప్రదాయ చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక మార్గాలు రూపొందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా డేటా ట్రాకింగ్, ఫలితాల మానిటరింగ్, ప్లేస్‌మెంట్ సమీక్ష వ్యవస్థను బలపరచాలి. చేతివృత్తులు కేవలం జీవనోపాధి కాదు; అవి సంస్కృతి, కుటుంబ గౌరవం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. అందువల్ల వాటికి ఆధునిక నైపుణ్య శిక్షణ, పరికరాలు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారి జీవన ప్రమాణం గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే స్థానికులకు ఉద్యోగాలు లభిస్తే వలసలు తగ్గి, కుటుంబాల ఆర్థిక భరోసా పెరుగుతుంది.
యువతకు ఉద్యోగం కల్పించడం అంటే ఒక్క వ్యక్తికి ఉపాధి కల్పించడం కాదు అది ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం. నైపుణ్యాభివృద్ధి అంటే కేవలం శిక్షణ కాదు; అది రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే సమగ్ర అభివృద్ధి ఉద్యమం.
అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని, నిధులు, పథకాలు, సాంకేతిక సహాయం, పరిశ్రమల సమన్వయం, నియామక హామీలు కలిపి సమగ్ర కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మనవి చేస్తున్నాము.
జనతా వారధి పల్నాడు జిల్లా జట్టు



