ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావుకు తోట రాజా రమేష్ మరియు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో ఘన స్వాగతం

చిలకలూరిపేట: వినుకొండ నియోజకవర్గంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావుకు చిలకలూరిపేట పట్టణ బైపాస్ రోడ్డు వద్ద జనసేన నాయకులు, వీర మహిళలు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు ప్రదాత మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో వీర మహిళలు, పార్టీ శ్రేణులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం అక్కడ నుండి భారీ ర్యాలీగా నరసరావుపేటలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని, పల్నాడు జిల్లా సమన్వయకర్తలు మరియు ముఖ్య నాయకులతో కలిసి టీ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ స్థితిగతులపై ముఖ్యంగా చర్చ జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ, మరియు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పోషిస్తున్న కీలక పాత్ర గురించి చరణ్ తేజ వివరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
“నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి” అని ఆయన కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share.
Leave A Reply