ముఖ్యమంత్రి సహాయ నిధి… ప్రజలకు గొప్ప ఆరోగ్య రక్షణ నిధి: ప్రత్తిపాటి

  • పలువురు అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందచేసిన ప్రత్తిపాటి.

ఆపదలో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలవారు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తగిన సాయం అందిస్తోందని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 23 మంది లబ్ధిదారులకు రూ.14.70 లక్షల విలువైన చెక్కుల్ని స్వయంగా అందచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ప్రత్తిపాటి, ప్రభుత్వ పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు వారికి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలిచే, వారి ఆరోగ్యాన్ని రక్షించే గొప్ప నిధి అని, వారికి ఎంతగానో ఉపయోగపడే గొప్ప సాయమని ప్రత్తిపాటి చెప్పారు.

కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply