ప్రజలు అవసరానికి మించిన ఇంధనం కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి

ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్పిడి వంటి చేస్తే కఠిన చర్యలు.

పల్నాడు జిల్లాలో 201 పెట్రోల్ బంకులు

ప్రతి పెట్రోల్ బంక్ వద్ద స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు

కంట్రోల్ రూమ్ నెంబర్: 08647226999

పల్నాడుజిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

ఏప్రిల్ 26 : జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.
జిల్లాలో పెట్రోల్, డీజల్ సరఫరా పరిస్థితిపై ఆదివారం అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఆదివారం ఉదయం రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిపై రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) మరియు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు.ప్రజల్లో ఆందోళన రాకుండా ప్రతి రోజు జాయింట్ కలెక్టర్లు ప్రెస్ మీట్ నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజులో 8,489 కిలోలీటర్ల పెట్రోల్ (MS) మరియు 10,556 కిలోలీటర్ల డీజిల్ (HSD) విక్రయాలు జరిగినట్లు మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని అధికారులు మంత్రికి స్పష్టం చేయడం జరిగిందన్నారు.OMCలు సరఫరాను మరింత పెంచుతున్నాయని, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ మరియు పోలీస్ బృందాలను పెట్రోల్ బంకుల వద్ద పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అదేశించియున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం కల్పించి నిల్వలు సమృద్ధిగా ఉంచుతున్నామన్నారు. ఎక్కడైనా కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల పై నిరంతరం,జేసీ,ఆర్ డి ఓ లు, తహశీల్దార్లు పర్యవేక్షణ చేస్తున్నారని,తెలిపారు.ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు లేదా కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని సూచించారు.వ్యవసాయం, మరియు పంటల కోత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్పిడి వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share.
Leave A Reply