’పేదల సేవలో’ … చంద్రబాబు పేదలకు అందిస్తున్న గొప్ప ప్రజా కర్షక పథకం : ప్రత్తిపాటి
- ఆర్థిక సంక్షోభాన్ని లెక్కచేయకుండా, ముఖ్యమంత్రి పేదల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు.
- ప్రతి నెలా రూ.3,500కోట్లకు పైగా ఆర్థిక సాయం పేదలకు అందిస్తున్నారు.
- వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రజా సంక్షేమంలో వెనకడుగు వేయరు.
- ‘పేదల సేవలో’ భాగంగా సామాజిక పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి.
పేదల సేవలో పేరిట ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రతినెలా 1వ తేదీన పేదల ఇళ్లకు వెళ్లిమరీ సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఈ విధంగా గొప్పగా అమలవుతున్న ప్రజాకర్షక పథకం ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
పేదల సేవలో భాగంగా శుక్రవారం ఆయన పట్టణంలోని 13వ వార్డు (మద్దినగర్), 14వ వార్డు (రహమత్ నగర్) లతో పాటు చిలకలూరిపేట మండలం పసుమర్రు, నాదెండ్ల మండలం గణపవరం, యడ్లపాడు మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్వయంగా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు.
రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ పేదల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పించాలన్న ఏకైక లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా రూ.3,500 కోట్లకు పైగా సాయాన్ని సామాజిక పింఛన్ల రూపంలో అందిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. జగన్ ఆర్థిక విధ్వంసం వల్లే ఇప్పటికీ అర్హులైన వారికి ప్రభుత్వం పింఛన్లు అందించలేకపోయిందని, జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు సిద్ధమైందని ఆయన తెలియచేశారు. జనగణనలో ప్రజలు విధిగా భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ, వ్యక్తిగత వివరాలు అందిస్తేనే వారికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా , సకాలంలో అందుతాయని ప్రత్తిపాటి తెలిపారు. గత పాలకులు ప్రజలతో ఓట్లు వేయించుకొని, వారిని అభివృద్ధి, సంక్షేమానికి దూరం చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ అవినీతి మంత్రిని నమ్మిఓట్లేసినందుకు తామెంత నష్టపోయామో ప్రజలకు ఇప్పటికి అర్థమైందన్నారు. పట్టణ శివారు ప్రాంతాల ప్రజలు గత ప్రభుత్వ అనాలోచిత, దోపిడీ విధానాలతో తామెంత నష్టపోయింది స్వయంగా తమతో చెప్పుకొని బాధపడుతున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రజా సంక్షేమంలో వెనకడుగు వేయరని, అనుకున్న విధంగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దినేని సుబ్బారావు , కందిమల్ల రఘురామారావు, మద్దిబోయిన శివ, మురకొండ మల్లిబాబు, ముల్లా కరీముల్లా, కొత్త కోటేశ్వరరావు, గంగా శ్రీనివాసరావు, బేరింగ్ మౌలాలి, జాకోబు రాజు, కొడవలి శ్రీను, జాలాది సుబ్బారావు, చౌదరి, సుదర్శన్, పెంట్యాల శేషయ్య, కెల్లంపల్లి అచ్చయ్య, పోపురి రాఘవయ్య, పోపురి వెంకయ్య, కాకుమాను చంటి, నాగేశ్వరరావు , సీతారామయ్య, పోతురాజు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, ఎంపీడీవోలు, వార్డు ప్రెసిడెంట్ లు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



