పేదల ఆరోగ్యం… ఆనందమే ప్రత్తిపాటి ఫౌండేషన్ కు ముఖ్యం : ప్రత్తిపాటి ప్రజలకు మెరుగైన కంటివైద్యం అందించించాలన్నసదాశయంతో ప్రభుత్వం కొన్ని వైద్యసంస్థలతో కలిసి మెరుగైన వైద్యసేవలు అందిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శంకర్ నేత్రాలయం వంటి ఆసుపత్రులు ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉందన్నారు. కంటి ఆపరేషన్లు చేయించుకునే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయం అందిస్తోందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన 36వ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి, 35వ వైద్యశిబిరంలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచిత కళ్లద్దాలు అందించారు. అనంతరం దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ (డీ.హెచ్.ఓ.ఎస్) వారు అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన వైద్యపరీక్షల యంత్రాన్ని ప్రత్తిపాటి లాంఛనంగా ప్రారంభించారు. యంత్రంతో 42 రకాల వైద్యపరీక్షలు చేయవచ్చని, అతి తక్కువఖర్చుతోనే ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని డీ.హెచ్.ఓ.ఎస్ డైరెక్టర్ దండమూడి అరవింద్ కుమార్, ఎమ్మెల్యే…
Author: chilakaluripetalocalnews@gmail.com
కందులు కొనుగోలు చేయండి : దాల్ మిల్లర్లతో సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావు పేట, జులై 10 కంది ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని దాల్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోరారు. వినుకొండ, దాచేపల్లి మండలాల్లో రైతుల వద్ద ఉన్న కందులను మిల్లర్లు మెరుగైన ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. ఈ వారంలోగా రైతులకు, మిల్లర్లకు ఆమోదయోగ్యమైన ఒక ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారానిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కందుల కొనుగోలుపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, ఆర్డీవోలు మధులత, రమణాకాంత్ రెడ్డి, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు – బొల్లా బ్రహ్మనాయుడు గారు స్వయంగా పర్యవేక్షణ వినుకొండ నియోజకవర్గంలో రేపు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతంగా జరగేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు స్వయంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. సమావేశ వేదిక వద్ద స్టేజ్, కూర్చోవడానికి సదుపాయాలు, నీటి సరఫరా, పార్కింగ్, భద్రత అంశాలపై ప్రత్యక్షంగా సమీక్షిస్తున్న ఆయన, స్థానిక నాయకులకు దిశానిర్దేశం అందించారు.
నేతన్నల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం : ప్రత్తిపాటి అనాది నుంచి చిలకలూరిపేట ప్రాంతం చేనేతపనికి పెట్టింది పేరని, కేంద్రప్రభుత్వ సబ్సిడీతో చేనేత కార్మికులు స్టాండ్ మగ్గాలతో తమ ఉత్పత్తుల తయారీ పెంచుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో గురువారం జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి చేనేత కార్మికుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి నేతకార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సబ్సిడీలతో నేతన్నలు ఆర్థికంగా బలపడాలి కేంద్ర జౌళిశాఖ ఒక్కో నేతగ్రూపుకు రూ.85లక్షల వరకు సబ్సిడీ ఇస్తోందని, గ్రూపుసభ్యులు కేవలం రూ.3లక్షలు కట్టుకుంటే చాలని ప్రత్తిపాటి చెప్పారు. ఆ సొమ్ముతో నూతన మగ్గాలు.. సరికొత్త ఉత్పత్తులతో నేత పనివారు బాగా సంపాదించుకోవచ్చని ప్రత్తిపాటి సూచించారు.
గణపవరం గ్రామానికి తెలగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కెల్లంపల్లి అచ్చయ్య నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి తెలగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కెల్లంపల్లి అచ్చయ్య నియమితులయ్యారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో తనకు ఈ పదవి వచ్చిందని ఈ సందర్భంగా కెల్లంపల్లి అచ్చయ్య తెలిపారు.శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన నియామకాన్ని స్వాగతిస్తూ, కెల్లంపల్లి అచ్చయ్యను దుశ్యాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు టిడిపి ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, పెంట్యాల శేషగిరిరావు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.గణపవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కెల్లంపల్లి అచ్చయ్యకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చయ్య నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నిషేధిత గుట్కా, పొగాకు అమ్మితే కఠిన చర్యలు: అర్బన్ సీఐ రమేష్ చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వద్దనిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను అమ్మినట్లయితే సంబంధిత షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం చిలకలూరిపేట పట్టణ స్టేషన్లో సీఐ రమేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రతి స్కూలు, కాలేజీలకు 100 మీటర్ల సమీప దూరంలో ఉన్న దుకాణాలలో తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. పొగాకు సంబంధించిన చుట్ట బీడీ సిగరెట్లు దుకాణాల్లో అమ్మవద్దని పొగాకు వలన విద్యార్థుల జీవితాలు చెడు వ్యసనాలకు బానిసగా మార్చే అవకాశం కలుగుతుందని విద్యార్థులను మంచి మార్గంలో నడవాలంటే వారి పాఠశాల చుట్టూపక్కలనుంచిమంచి.వాతావరణంఉండాలని ఆయన కోరారు విద్యార్థులు పట్టణ ప్రజలు చెడు వ్యసనాలకు అలవాటు పడి యువత వారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ సేవించినా విక్రయించిన వారి వద్ద కలిగి ఉన్న రవాణా…
జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా త్రిపురం సాయి…. చిలకలూరిపేట.. పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యాలయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన త్రిపురం హరికృష్ణ ( సాయి ) ని నియోజకవర్గ యువజన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సాయి నియామిక పత్రాన్ని పల్నాడు జిల్లా లిగల్ సెల్ చైర్మన్ పమిడి రాజకుమార్, పల్నాడు జిల్లా యువజన అధ్యక్షులు మాదాసు పృథ్విరాజ్ ( సాయి ) చేతుల మీదగా అందుకోవడం జరిగింది . ఈ సందర్భంగా పమిడి రాజ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నీ బీసీ సామాజిక వర్గ యువతకు అందుబాటులో ఉండి అతి త్వరలో కమిటీలు పూర్తి చేయాలని అలానే ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆయన అన్నారు. పృధ్వీరాజ్ సాయి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు దీటుగా బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతానికి కృషి చేస్తామని బీసీల పట్ల ఎక్కడ ఏ సమస్య…
పట్టణంలోని భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హై స్కూల్ లో ఘనంగా జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ . చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో గల భారత రత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హైస్కూల్ నందు 10.07 .25 న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గేరా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ రఫాని హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని, ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తుందని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వ ప్రయత్నం అయినా ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయం సాధిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తు కోసం ఇలాంటి తల్లిదండ్రుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరై తమ బిడ్డల ప్రగతి గురించి తెలుసుకోవాలని,…
చిలకలూరిపేట కాపు కళ్యాణ మండప పునఃనిర్మాణ సన్నాహక సమావేశముతెలగ, బలిజ, కాపు కుటుంబ సభ్యులకు స్వాగతం! సుస్వాగతం!!తేదీ:13-07-2025 ఆదివారం ఉదయం 10-00 గంటలకు చిలకలూరిపేట కృష్ణారెడ్డి డొంకలో గల చిలకలూరిపేట పట్టణం లోని తెలగ,బలిజ,కాపు సేవా సంఘం, కళ్యాణ మండప పునఃనిర్మాణ సన్నాహక సమావేశము జరుగును. ఈ సమావేశమునకు పట్టణంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని తెలగ,బలిజ,కాపు నాయకులందరూ ఈ సమావేశమునకు విచ్చేసి కళ్యాణమండపం పునః నిర్మాణ అభివృద్ధి కొరకై విశాల హృదయంతో నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం.ఈ సమావేశమునకు చిలకలూరిపేట నియోజకవర్గంలోని తెలగ,బలిజ,కాపు నాయకులు అందరూ ఆహ్వానితులే. Note: (మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది.)
గురు పౌర్ణమి సందర్భంగా గురువులను సత్కరించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం.తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆషాడమాసం, బహుళ పౌర్ణమిని పురస్కరించుకొని చిలకలూరిపేట లోని తెలుగు రచయిత గురువులను బిజెపి నాయుకులు ఘనంగా సత్కరించారు చిలకలూరిపేట బిజెపి నాయకులు గురుపౌర్ణమి పర్వదినమును ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా తమ తెలుగు రచయిత గురువులు పీవీ సుబ్బారావు, ను ఘనంగా సత్కరించారు. సందర్భంగా గురువులు నేర్పిన,విద్యను ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా కనీసం ఒక గంట పాటు అభ్యాసం చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి అయినా సరే ఆ సరస్వతి దేవి అనుగ్రహం పొందగలరు ఈ సందర్భంగా సన్మానితులు మాట్లాడారు మారు . క్రమశిక్షణతో కూడిన విద్యకు, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతుందని, నియమిత ఆహారం, సమయపాలన, ప్రశాంతమైన నిద్ర మనిషి మానసిక శారీరక ఉన్నతికి తోడ్పడతాయని తెలియజేశారు…









