ఈజిప్టులో పర్యటిస్తున్న బృందం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తోంది. ముందుగా కైరోలోని జమాలెక్లోని అల్-హోర్రెయా పార్కులో మహాత్మా గాంధీ గారికి ఈ ప్రతినిధి బృందం నివాళులర్పించింది. ఈ బృందం ఆ దేశంలోని ప్రస్తుత, మాజీ మంత్రులు, ప్రముఖ రచయితలు, సమాజకర్తలు, నాయకులతో సహా ఈజిప్టులోని కీలక సంభాషణకర్తలతో కూడా చర్చలు జరుపుతోంది. ఉగ్రవాద నిరోధకతపై సన్నిహిత ద్వైపాక్షిక సహకారం గురించి వివరిస్తూ, దేశ సహకారాన్ని కోరారు.ఈ బృందంలో :ఎంపీలు.. సుప్రియా సులే, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, విక్రమ్‌జీత్ సింగ్ సాహ్నే, ఆనంద్ శర్మ, వి. మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ (ఐక్యరాజ్యసమితికి భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి) ఉన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ. కానీ అది పూర్తిగా తప్పు నాగర్జున సాగర్ డ్యామ్ ను నిర్మించింది వల్లుట్ల (గోత్రం) వాసిరెడ్డి గృహనామానికి చెందిన ముక్త్యాల సంస్థానానికి చెందిన శ్రీ రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ …. వీరి విగ్రహం కూడా ఈ డ్యామ్ పరిసరాల్లో నేటికీ ఉంటుంది. అసలు ఈ డ్యామ్ ను కట్టాలని ఆనాటి ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆశక్తి లేదు. రాజా వారు లక్షల ఎకరాలు, కోటి రూపాయల డబ్బు ప్రభుత్వానికి దానంగా ఇచ్చేసరికి చివరికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మాచర్ల అటవీ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు వెళ్ళడానికి రోడ్డు వేయించారు రాజా వారు. ప్రజలకు మంచి చెయ్యటం కోసం చరిత్రలో ఎన్నో లక్షల ఎకరాల భూములు, ఎంతో సంపదను దానం చేశారు. ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్రదేశంలో పేరు…
ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేత.చిలకలూరిపేట, నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశ్రీలక సభ్యుడు గజ్జ. శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతడు జనసేన పార్టీ క్రియా శిలక సభ్యత్వం ఉండటం వలన పార్టీ నుండి ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఎమ్మెల్సీ శ్రీ కె .నాగబాబు గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ గారిని కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగ రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పార్టీల కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించే పార్టీ జనసేన అని…
రేపు కరెంటు కట్ చేసే ఏరియాలు రేపుచిలకలూరిపేట టౌన్ వన్ సెక్షన్ పరిధిలో విద్యుత్ లైన్లకు మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ప్రాంతాల వివరాలు ఇలా విద్యుత్ నిలిపివేత సమయం ఈ అంతరాయం పట్ల వినియోగదారులుసహకరించవలసిందిగా విద్యుత్ శాఖ తరపున ఆర్. అశోక్ కుమార్, డీఈఈ, చిలకలూరిపేట విజ్ఞప్తి చేశారు.
రేపు నాగార్జున సాగర్ వద్ద యోగాంధ్ర నరసరావు పేట,జిల్లాలోని ప్రముఖ పర్యాటక పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద రేపు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా అవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోటపై, జూన్ 18న అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ నెల 5 న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు శంకు ప్రతిష్ట మహోత్సవం జరుగు చున్నది. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని కోరిన గణపవరం అయ్యప్ప సేవా సంఘం మరియు అయ్యప్ప భక్తులు… ఈ ఆహ్వాన కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు మండలనేని వెంకటేశ్వర్లు, గురుస్వామి తులం పూర్ణచంద్రరావు , మాదినేని చంద్రమౌళి , కెల్లంపల్లి రెడ్డియ్య మాస్టర్ , సిద్దు హనుమంతరావు , అధికారి వెంకటేష్ , చక్రవరం శివరాజు తదితరులున్నారు.
సిద్ధి గణపతి, అభయాంజనేయస్వామి వార్ల గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి శ్రీ సిద్ధిగణపతి, శ్రీ అభయాంజనేయస్వామి, సీతలాంబ తల్లి బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా తలపెట్టిన గ్రామోత్సవాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మంగళవారం యడ్లపాడు మండలం జగ్గాపురంలో జరిగిన గ్రామోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి ప్రజలతో కలిసి స్వామివార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన హోమంలో పాల్గొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతం ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్లపై గ్రామస్తులు, కార్యక్రమాల నిర్వాహకులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, స్వామివార్ల అనుగ్రహాం లభించేలా శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా ప్రతిష్టామహోత్సవం నిర్వహించాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, ముద్దన నాగేశ్వరరావు, వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కందిమళ్ళ రఘురామారావు, సుబ్బారావు, శంకర్రావు, గట్టినేని విజయ్ సాయి, పోపూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ముద్దన పార్థసారథి, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా… నరసరావుపేట నరసరావుపేట ఎమ్మెల్యే డా’చదలవాడ అరవింద బాబు మీడియా సమావేశం వైసీపీ తీరు మారాలి తీరు మారకపోవటం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారు మాజీ సీఎం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కి ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే అరవింద్ బాబు 2029లో కూడా నరసరావుపేట కి నేనే ఎమ్మెల్యేని మా నాయకుడు చంద్రబాబే సీఎం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎవరినైనా ప్రశాంతంగా వుండనిచ్చారా ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారలేదు అమరావతికి పోలవరానికి మూడు రాజధానుల పేరిట తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా ఆలోచించుకోండి మీ హయాంలో మాచెర్లలో ఎన్ని హత్యలు జరిగాయి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గోపిరెడ్డి రియల్ ఎస్టేట్ మున్సిపాలిటీలో నువ్వు చేసిన అవినీతి ప్రజలు మరిచి పోలేదు ఇండ్ల మీద పడి చేసిన దాడులను ప్రజలు గుర్తుపెట్టుకొనే ఉన్నారు ఇప్పటి కైనా మీలో మార్పురాకపోతే 11…
తెలుగువారి చారిత్రక వైభవానికి, వారసత్వానికి ప్రతీక కొండవీడుకోట– మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ తులసిరెడ్డి యడ్లపాడు మండలంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొండవీడుకోటను మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ తులసిరెడ్డి మంగళవారం సందర్శించారు. ముందుగా ఘాట్‌రోడ్డు, మహాద్వారం, పిల్లల క్రీడాపార్కు, తూర్పు ద్వారము (కట్టిలదిద్ది వాకిలి), లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేమన మండపం, అనవేమారెడ్డి విగ్రహం, చారిత్రక అంశాలను వివరించే గ్యాలరీ, ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల చెరువు డెక్కు ప్రాంతాలతో పాటు కొండపై ఉన్న చారిత్రక ప్రదేశాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కత్తులబావి సందర్శనకు వెళ్లగా కోటగ్రామస్తులు సాదరస్వాగతం పలికారు. కొండవీటి కైఫియత్తు ఆధారంగా 72 మంది పాలెగాండ్ల తిరుగుబాటును అణచివేసేందుకు బావిలో కత్తులు అమర్చి జరిగిన ఘోర ఘటనను కల్లి శివారెడ్డి వివరించారు. అక్కడ నుంచి హౌస్‌గణేష్‌పాడులోని అఖిలభారత రెడ్లసంక్షేమ సమాఖ్య ఏర్పాటు చేసిన కొండవీటి రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాలను సందర్శించారు. అక్కడ ఇటీవల లభ్యమైన…
చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, అవిశాయపాలెం గ్రామంలో జరుగుచున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు గారి అత్తయ్య పునాటి స్వరాజ్యమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, మద్దూరి వీరా రెడ్డి గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.









