చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
ముఖ్యఅతిథిగా కామినేని హనుమంతరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లాబిజెపి అధ్యక్షలు ఏలూరి శశి కుమార్ సూచనలు తో 04-11-2025 న పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం నందు ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట లో బిజెపి బలోపేతానికి కృషి చేస్తున్న బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు విచ్చేసి చిలకలూరిపేట పట్టణంలో పట్టణ బిజెపి అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు బూత్ కమిటీలు వేయ్యటం కూడా జరిగింది చిలకలూరిపేట పట్టణములో జెండా ఆవిష్కరణకు అన్ని సెంటర్లలో జెండా ఆవిష్కరణకు భూమి సేకరించడం జరిగింది మరియు పార్టీలోకి కొత్తవారిని కూడా ఆహ్వానించడం జరిగింది
ముఖ్య అతిథిగా పాల్గొన్నపల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శ. కామినేని హనుమంతరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు ప్రతి బూతులో కమిటీల బలోపేతానికి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి కామినేని హనుమంతరావు మాట్లాడుతూ ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ప్రతి గడపకు స్వదేశీ ఈవస్తువులని కొనండి అని బిజెపి నాయకులు తో కలిసి చిలకలూరిపేట పట్టణం లో స్టిక్కర్లు అంటించారు మరియు ప్రతి ఇంటిలో స్వదేశీ వస్తువుల పైన అది కొనుక్కుంటే మన దేశానికి వచ్చే లాభం మీద అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ, ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, సహాయ ప్రధాన కార్యదర్శి కుప్పం కళ్యాణ్ దుర్గరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రటరీ గట్ట హేమకుమార్, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, మాజీ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, బీజేవైఎం అధ్యక్షులు పులిగుజ్జు మహేష్, పసుమర్రు నాయకులు పుల్లారావు, గుమ్మ బాలకృష్ణ, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ సుభాని పట్టణ మాజీ ఉపాధ్యక్షులు దడబడ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు



