చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ శనివారం రోజున స్థానిక నరసరావుపేట సెంటర్ నందు గల బీజేపీ నియోజకవర్గ కార్యాలయం లొ జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎడ్లపాడు మండలం సందేపూడి గ్రామం నుండి గుర్రం విజయకుమార్ వద్దనుండి వారి పొలం కు సంబందించిన సమస్య పై ఫిర్యాదు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాగే ఉన్నవ గ్రామం నుండి వడ్డేపల్లి సుబ్బమ్మ తమ ఇంటి స్థలం సమస్య గురించి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సదరు ఈ విషయంపై ఉన్నవ పంచాయతీ సెక్రెటరీ తో మాట్లాడి త్వరితగతిన సమస్య పరిష్కరించాలని బిజెపి పార్టీని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఎడ్లపాడు మండల అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు వడ్డేపల్లి సుబ్బమ్మ గుర్రం విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.



