శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు నాదెండ్ల మండలం జంగాలపల్లి లో వైఎస్ఆర్సిపి కు చెందిన శ్రీకాంత్ రెడ్డిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి ఆదివారం చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు. శ్రీకాంత్ రెడ్డి కి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి. మూడు రోజుల్లో సూరీటీ లు సమర్పించవలసిందిగా ఆదేశించినట్లు తెలిసింది…
Author: chilakaluripetalocalnews@gmail.com
[5:14 PM, 5/11/2025] aapstatekapunadu99: పల్నాడు జిల్లా పోలీస్ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి SRKT నందు కార్డెన్ సెర్చ్ … నరసరావుపేట డి.ఎస్.పి అయిన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 సిఐ లు,14 మంది ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు ANS సిబ్బందితో కలిసి ఈరోజు తెల్లవారుఝామున 4.30 గంటల నుండి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు… ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు …ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు … నరసరావుపేట రూరల్ పోలీస్టేషన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్…
చిలకలూరిపేట మండలం, కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుత్తా శ్రీనివాసరావు గారి కుమారుని వివాహం సందర్భంగా ఈరోజు వారి ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా అక్కడికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు , గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
చిలకలూరిపేట పట్టణం, 32వ వార్డు నందు దార్ల వెంకటేశ్వర్లు గారి కుమార్తె వివాహ ప్రధానం కార్యక్రమానికి విచ్చేసి కాబోయే నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో జువ్వాజి మదన్ మోహన్ గారు, రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, జంగా వినాయకరావు గారు,అవ్వరు రమేష్ గారు, బిట్ర బ్రహ్మంగారు, కుమారి గారు పలువురు ఆశీర్వదించారు.
చిలకలూరిపేట పట్టణం, నరసరావుపేట సెంటర్ వద్ద ఉన్న ఐ టి సి టొబాకో కంపెనీ వద్ద ఈశ్వర్ వరప్రసాద్ (ITC బాబు) గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో జువ్వజి మదన్ మోహన్ గారు, చింతకాయల కోటేశ్వరరావు గారు పలువురు విచ్చేశారు.
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలి -ఎస్టియు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు బదిలీలు జరగబోయే నేపథ్యంలో బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నట్లు ఎస్టియు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు ఎస్టియు డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా బదిలీలలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండే విధంగామరియు 120 రోలు దాటిన ప్రతి పాఠశాలకు ఒక పిఎస్ హెచ్ఎం అయిదుగురు టీచర్లు ఉండే విధంగా బదిలీలు నిర్వహించాలని కోరారు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 గా నిర్ణయించాలని కోరారు,రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 అర్బన్ లోకల్ బాడీ మున్సిపల్ పాఠశాలలో మున్సిపల్ మేనేజ్మెంట్లో అప్ గ్రేడ్ అయిన స్కూల్స్ మరియు 75/100 రోల్ హై స్కూల్స్ కి హెచ్ఎం మరియు స్కూల్…
శ్రీధర్- పూర్ణిమ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామ వాస్తవ్యులు పెడవల్లి రామాంజనేయులు గారి కుమారుని వివాహం ఈ నెల 9న గుంటూరులో జరుగగా ఈరోజు వారి స్వగృహం నందు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమమునకు హాజరై నూతన వధూవరులు శ్రీధర్- పూర్ణిమ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు … ఈ కార్యక్రమంలో వారి వెంట పెడవల్లి చినబాబు గారు,గ్రామ సర్పంచ్ హమీదా గారు, కక్కెర శ్రీనివాసరావు గారు,మన్నవ మాణిక్యాలరావు గారు,పెడవల్లి శ్రీనివాసరావు గారు, కావూరి శ్రీనివాసరావు గారు తదితరులు ఉన్నారు.
జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ అరవిందబాబు నరసరావుపేట పట్టణంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ప్రమాణస్వీకారం మహోత్సవంలో నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కమిటీ సభ్యులను ప్రకటించారు అనంతరం జర్నలిస్టులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజల గొంతుగా పనిచేస్తున్న జర్నలిస్టులను అభినందించారు జర్నలిస్టులకు ఇంటి సదుపాయాలు వైద్య సదుపాయాలు ఆర్థిక సదుపాయాలను అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మీడియా సోదరులు పాల్గొన్నారు
వినుకొండ మండలం మదమంచిపాటి “శ్రీ వీరాంజనేయ స్వామి” దేవస్థానం నందు రెడ్డి వెంకటరత్నం గారి మనుమడి “అన్నప్రసాన” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారు మరియు వినుకొండ మాజీ ఎమ్మెల్యే శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు.. తదితరులు..
ఉగ్రవాదంపై పోరాటంలో విజయం కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు– మోదీకి మద్దతుగా బీజేపీ నాయకులు ఎడ్లపాడు మండలంలోని పలు దేవాలయాల్లో శనివారం ఉగ్రవాదులపై పోరాటంలో భారత సైనికులు విజయం సాధించాలని, దేశ రక్షణ కోసం పోరాడుతున్న వారికి దైవ ఆశీస్సులు కలగాలని కోరుతూ బీజేపీ మండల నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలంతా మద్దతుగా ఉన్నామని ప్రకటించారు. దేశ రక్షణ కోసం మోదీ చేస్తున్న యజ్ఞానికి దైవ బలం కూడా తోడవాలని ప్రార్థించారు. పూజల కార్యక్రమంలో ఎడ్లపాడు బీజేపీ మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేగేసినఅంజిరాజు, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, రావూరి సుబ్బారావు, అయిలవరపు రామారావు, బందెల శ్రీనివాసరావు, భీమరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.