జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొని ఒరిస్సా కార్మికుడు దుర్మరణం

మరొకరికి తీవ్ర గాయాలు.

గణపవరం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన

మృతిని స్నేహితుడు లిట్టును తీవ్ర గాయాలు.

తిమ్మాపురం గ్రామ పరిధిలో ఉన్న తిరుమల స్పిన్నింగ్ మిల్లు లో పని చేసే ప్రీతం మాలిక్ (24)తన సోదరుడు తో కలిసి కంపెనీ వసతి గృహంలో ఉంటున్నాడు.

గత రెండు సంవత్సరాలు గా కంపెనీ లో పని చేస్తున్నాడు.

తన స్నేహితుడు లిట్టు తో కలిసి ప్రీతం మాలిక్ బైక్ పై చిలకలూరిపేట వచ్చి వెళుతున్న సమయంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను వేగంగా ఢీకొనడంతో ప్రీతం మాలిక్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తన స్నేహితుడు లిట్టుకు తీవ్రగాయాలయ్యాయి… లిట్టును గుంటూరు వైద్యశాల కు తరలించారు.

ఘటన స్థలాన్ని నాదెండ్ల SI పుల్లారావు పరిశీలించి కేసు నమోదు చేశారు.

Share.
Leave A Reply