పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు & వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాదిమంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించే జాబు మేళ ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ జీవి గారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply