వెన్నుపోటు దినం.. కదం తొక్కుదాం..మాజీమంత్రి విడదల రజిని పిలుపు
కూటమి మోసాల్ని ఎండకట్టేందుకే నిరసన అంటూ వెల్లడి
జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో చిలకలూరిపేట పట్టణంలో భారీ ర్యాలీ
ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ
పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ
చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్ 4వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమ పోస్టర్‌ను పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రి విడదల రజిని వారి నివాసంలో ఆవిష్కరించారు.
ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం పార్టీ నాయకులకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



