హెల్మెట్ ధరించని వారి దగ్గర అపరాధ రుసుము విధించిన ఎస్సై లేఖ ప్రియాంక వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై లేఖ ప్రియాంక అన్నారు. గురువారం చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల రహదారిపై వాహనాలను సిబ్బందితో కలిసి ఆమె తనిఖీలు చేపట్టారు. హెల్మెట్లు లేని 17 వాహనాల వద్ద రూ.10,185 జరీమాన విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనానికి సంబంధించి RC దగ్గర ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు తెలిపారు. పోలీసుల సలహాలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని వాహనదారులకు ఎస్ఐ సూచనలు ఇచ్చారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈవారం జనతావారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండలంలోని వయ్యకల్లు గ్రామంలో నిర్వహించడం జరిగింది ,కార్యక్రమంలో నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది, ముఖ్యంగా పొలం బాటకు వెళ్లే రహదారి కొరకు, త్రాగు నీటిలో ఫ్లోరిన్ సమస్య పరిష్కారం కొరకు, సైడ్ డ్రైనేజీల మరమ్మతులు మరియు నిర్మాణం కొరకు, కిసాన్ సంబంధిది నిధులు కొరకు, దరఖాస్తులు రావడం జరిగింది, ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు, బిజెపి నేతలు అన్నవరపు శ్రీనివాసరావు, నార్ల సాంబశివరావు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి: కలెక్టర్ పల్నాడులో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కార్మికులు సమీప కార్మికశాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు తప్పనిసరిగా నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. నమోదు చేసిన కార్మికులకు వివిధ సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
వినుకొండ పట్టణం లొ బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P V N మాధవ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల ప్రకారం మన వినుకొండ పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది.జనతా వారధి అనగా ప్రజల నుంచి సమస్యలు సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దాన్ని పరిష్కరించే కార్యక్రమమే ఈ జనతా వారధి .దీనిలో భాగంగా జరిగిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా గృహ సంపర్కం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కోవడం జరిగినది.అది వారం ఉదయం బోసు బొమ్మ దగ్గర ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో పూజా కార్యక్రమం పూర్తిచేసుకుని అక్కడి నుండి బొమ్మ మీదగా పప్పు బజార్ వరకు గృహ సంపర్కం చేయడం జరిగింది కార్యక్రమంలో…
మేడం రమేష్ పై హత్యాకు కుట్ర.. పల్నాడు జిల్లా,వినుకొండ: సీనియర్ నాయకుడు, వైశ్య ప్రముఖుడు, ప్రముఖ అపరాల వ్యాపారి మేడం రమేష్ పై హత్యకు కుట్ర పన్నారు. కుట్ర గుట్టు రట్టు కావడం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం వినుకొండ పోలీసులు క్రైమ్ నెంబర్ 91/2026, 506-308 సెక్షన్ల క్రింద ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన గొట్టం గోవిందరాజులు 2020లో లేని భూమిని ఉన్నట్టుగా చూపి అక్రమంగా జగనన్న కాలనీకి ప్రభుత్వానికి అమ్మి సుమారు 90 లక్షలు స్వాహా చేశారు. ఈ అవినీతిని మేడం రమేష్ బయటకు తీసి గత ఏడాది అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి నిగ్గు తేలింది. దీనితో కక్ష కట్టిన గొట్టం గోవిందరాజులు, B. వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి మేడం రమేష్ హత్యకు కుట్ర పన్ని సుపారి ఇచ్చి హత మార్చే ప్రయత్నం చేశారంటూ, తనకు…
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ గారు పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్.,జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,పల్నాడు జిల్లా విషయం:పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి. అమ్మ , భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో…
ఆర్డీవో గా డివిజన్ లో మంచి పేరు తీసుకురావాలి నరసరావుపేట డివిజన్ లో ప్రజలకు మంచి సేవ చేయాలని నూతన ఆర్డీవో బాలకృష్ణ ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాలకృష్ణ ఆదివారం చిలకలూరిపేట లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని , డివిజన్ కి మంచి పేరు తీసుకురావాలని ఆర్డీవో కు ఎమ్మెల్యే సూచించారు.
“పోదాం పోదాం సర్కారు బడికి పోదాం” నినాదాలతో అవగాహన ర్యాలీ చిలకలూరిపేట లోకల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు మేరకు ఈనెల 18నుంచి23వరకు పాఠశాల ఆవాస్ ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలను బడి బయట ఉండకుండా బడిలో చేర్చుకునే విధంగా బడిబాట ర్యాలీ నిర్వహించాలని అదేవిధంగా చదువు మధ్యలో ఆపేసిన డ్రాప్స్ తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా ఈ ర్యాలీ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు నూతన 2026-27విద్యా సంవత్సరంలో పాఠశాల ఆవాస ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలందరూ బడిలోనే ఉండాలని బాల కార్మికులు కానీ నవ ఎన్రోల్మెంట్ గాని ఉండకూడదని ఉద్దేశంతో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పోదాం పోదాం -సర్కారు బడికి పోదాం,డబ్బులు ఎందుకు దండగ -సర్కారు బడి ఉండగా వంటి నినాదాలతో విద్యార్థులు పోలిరెడ్డి పాలెం లో బడిబాటర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ అడ్మిషన్ ప్రక్రియ…
భూగర్భ జలాల పెంపు ప్రజల కనీస బాధ్యత : ప్రత్తిపాటి పరిశుభ్రత..నీటి భద్రతను ప్రజలు తమ జీవనవిధానంగా మార్చుకోవాలని, భూగర్భ జలాల పెంపు దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, పారిశుధ్య సిబ్బంది, ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో తవ్విన ఇంకుడు గుంతను పరిశీలించారు.అనంతరం నీటి భద్రత.. పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్, సచివాలయ సిబ్బందికి ప్రత్తిపాటి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జల సంరక్షణ చర్యల్ని సమర్థవంతంగా అమలుచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికే మార్గదర్శిగా నిలిచారని, గతంలోనే ఆయన ఇంకుడు గుంతల తవ్వకంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, జన్మభూమి కార్యక్రమంతో నీటి పొదుపు మార్గాలను ప్రజలు పాటించేలా చేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రజలు పరిసరాల…
చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. మాజీ కమిషనర్‌తో సహా తొమ్మిది మందిపై వేటు! చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును కాజేసిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నకిలీ రసీదులు సృష్టించి ఏకంగా రూ.34 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. నకిలీ రసీదులతో నయా దందా: పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను, కుళాయి పన్ను తదితర పన్నులు చెల్లించడానికి వచ్చిన అమాయక ప్రజలకు మున్సిపల్ సిబ్బంది నకిలీ రసీదులు చేతిలో పెట్టారు. వసూలైన నగదును ఖజానాకు జమ చేయకుండా రూ.34 లక్షల వరకు పక్కదారి పట్టించారు. మాజీ కమిషనర్‌పై యాక్షన్: ఈ భారీ స్కామ్‌కు బాధ్యులను చేస్తూ అప్పటి మున్సిపల్ కమిషనర్…









