హెల్మెట్ ధరించని వారి దగ్గర అపరాధ రుసుము విధించిన ఎస్సై లేఖ ప్రియాంక

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై లేఖ ప్రియాంక అన్నారు. గురువారం చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల రహదారిపై వాహనాలను సిబ్బందితో కలిసి ఆమె తనిఖీలు చేపట్టారు. హెల్మెట్లు లేని 17 వాహనాల వద్ద రూ.10,185 జరీమాన విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనానికి సంబంధించి RC దగ్గర ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు తెలిపారు. పోలీసుల సలహాలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని వాహనదారులకు ఎస్ఐ సూచనలు ఇచ్చారు.

Share.
Leave A Reply