వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి ఘన నివాళి ప్రభుత్వ స్పందన పై కృతజ్ఞతలు:బి.శ్రీను నాయక్. భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో ఆయన శుక్రవారం చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి యస్. సవితా రూ.5 లక్షలు అందజేశారని పేర్కొన్నారు.వారికి గిరిజన సంఘం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం గర్వించదగ్గ వీరుడుగా వీరమరణం మురళి నాయక్ పొందారు. అతి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో సర్దార్ భగత్ సింగ్,…
Author: chilakaluripetalocalnews@gmail.com
మాజీమంత్రి, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి కార్యాలయం,చిలకలూరిపేట విడదల రజనీ బంధువులు మా స్థలం ఆక్రమించారు ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించనని, పరిష్కరించగలిగే సమస్యల్ని కూడా యంత్రాంగం పక్కన పెట్టడం మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన కూటమినేతలతో కలిసి ప్రజా వేదిక నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించిన ప్రత్తిపాటి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. మాజీమంత్రి బంధువులు మా స్థలం ఆక్రమించారు.. పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలోని సాయిబాబా గుడివద్ద తమకున్న 10 సెంట్ల స్థలాన్ని విడదల రజనీ బంధువులు ఆక్రమించారని, సమస్య పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ స్థల యజమానులు ప్రత్తిపాటిని ఆశ్రయించారు. సమస్య వివరాలు తెలుసుకున్న ప్రత్తిపాటి, బాధితులతో మాట్లాడి వారికి వెంటనే న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్…
పిడుగుపాటుతో మహిళ మృతి – ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పరామర్శ నరసరావుపేట మండలం నల్లగార్లపాడు పంచాయతీ పరిధిలోని పాలపాడు రోడ్డులో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గట్ల చిన్నమ్మ (వయస్సు 55) అనే మహిళ దుర్మరణం చెందారు. మృతురాలు భర్త పెద్ద అంకిరెడ్డి భార్య కాగా, వారికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషాద ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరులకు సన్మానంపట్టణంలోని తెలుగు మీడియా ఫెడరేషన్.పి శివ. మనోహర్అధ్యక్షతనబీసీ ఆఫీస్ నందు ప్రపంచ విలేకరుల స్వేచ్ఛ పరిరక్షణ దివస్ లో భాగంగా యువ విలేకరులని ఘనంగా సన్మానించడం జరిగింది మొదటిగా ఇమ్మడి సురేంద్ర బిఆర్కె న్యూస్ మాట్లాడుతూ జర్నలిస్టులను స్వేచ్ఛగా వారి విధులను చేసుకోవాలని తెలియపరిచారు మరియు అమరావతి విలేకరి మనోహర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు వైద్య పరమైన సౌకర్యాలు గృహాలను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించారు అల్లడి హరిబాబు మాట్లాడుతూ మీడియాను గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుభాని . బాలు. బొబ్బబెల్లివెంకటనారాయణ. షబ్బీర్ . వీరయ్య . దేవరకొండ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
అవమానభారంతో రైతులకు ముఖం చూపించలేకే .. రాజధాని సభకు జగన్ ముఖం చాటేశాడు : మాజీమంత్రి ప్రత్తిపాటి- అధికారంలో ఉండి కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించారు.. నేడు ప్రజల కళ్లలోని సంతోషం చూడలేకే రాజధాని వేడుకకు దూరమయ్యారు.: ప్రత్తిపాటి.- నిత్యకల్యాణంలా జరిగే అమరావతి పనుల్ని చూస్తూ, వేధించిన రైతుల ఎదుటే తన రాజకీయ కార్యకలాపాలు సాగించాలనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి : ప్రత్తిపాటి“ అమరావతి పున: నిర్మాణ ఘట్టాన్ని యావత్ భారతావని ఉత్సుకతతో తిలకించింది. 5 కోట్ల ఆంధ్రుల కళ్లు చెదిరిపోయేలా, అమరావతిపై అకారణంగా అక్కసువెళ్లగక్కిన వారు కళ్లలో నిప్పులు పోసుకునేలా రాజధాని సభ నభూతో అన్నట్టుగా భారీస్థాయిలో విజయవంతమైంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలు, రాజధానికి అండగా ఉంటానన్న ఆయన భరోసా తెలుగుజాతిలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మతృప్తిని నింపాయి. ప్రధాని ప్రసంగంపై ప్రజల్లో హర్హాతిరేకాలు వ్యక్తమవుతుండటమే దానికి నిదర్శనం. దైవానుగ్రహంతో అన్నీ అనుకూలించి, సకాలంలో అమరావతి నిర్మాణం పూర్తై, ఆ మహానగరం తమ…
చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, ఈవూరివారిపాలెం గ్రామానికి చెందిన కేతినేని ప్రమీల గారు ఇటీవల మరణించగా, ఈరోజు ఈవూరివారిపాలెం గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుచున్న వారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్, పఠాన్ సమద్, ధూళిపాళ్ళ పద్మ, కేతినేని శ్రీహరి, నాగభైరు ఆంజనేయులు, కేతినేని శ్రీహరి ( కాటన్ ), ఈవూరి బ్రహ్మానందం, నాగభైరు సాంబశివరావు, దూళిపాళ్ళ శ్రీనివాసరావు, నాగభైరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు…
చిలకలూరిపేట పట్టణంలోని, పాటిమీద వేంచేసియున్న అంకమ్మతల్లి, పోతురాజు స్వామివార్ల 24వ తిరుణాళ్ళ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అమ్మవారి తిరుణాళ్ళ వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ వారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, …
చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జ్ మద్ది శివ శంకర్ గుప్తా గారు మరణించగా వారి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
చిలకలూరిపేట పట్టణం, 9వ వార్డ్, రజక కాలనీలో వేంచేసియున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంపై స్వామివారిని దర్శించుకొని, కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, పఠాన్ సమద్ గారు, మద్దుమాల రవి గారు, గంగా శ్రీనివాసరావు గారు, గట్టినేని రమేష్ గారు, పుటిగంపు వెంకటేశ్వరరావు గారు, మండవ వెంకట్రావు గారు, ఒంటిపులి వెంకట్ గారు, మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…
ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.1886లో అమెరికాలోని చికాగోలో* హే* అనేటువంటి మార్కెట్లో 18 గంటలు పని చేయడం నుండి సమయం తగ్గించాలని మొదలైన ఉద్యమం ఆరుగురు కార్మికులు ఏడుగురు పోలీసులు చనిపోవడం, తర్వాత కార్మికుల నాయకుల్ని నలుగురిని ఉరి తీయడం తో మొదలైన ఈ ఉద్యమం యూరప్ దేశాల్లో మొట్టమొదటిసారిగా మే 1 న సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.మన భారతదేశానికి 1923న మద్రాస్ రాష్ట్రంలో “కిసాన్ పార్టీ ఆఫ్ ఇండియా” వారు మొట్టమొదటిగా సెలవుదినంగా ప్రకటించడం తరువాత భారతదేశమంతటా సెలవు దినంగా ప్రకటించటం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి కార్మికుల ఐక్యత కోసం కార్మికుల ఉన్నతి కోసం మానవ హక్కుల సంఘం తరఫున సంఘీభావ ర్యాలీని చేయటం జరిగింది ర్యాలీలో పాల్గొన్న అందరికీ చైర్మన్ అబ్దుల్ మునాఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


