తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా 35వ వార్డులో నూతన కార్యవర్గం ఎన్నిక
చిలకలూరిపేట పట్టణంలోని, 35వ వార్డ్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాసుల శివకృష్ణ, ప్రధాన కార్యదర్శి గా జరపల చిన్న నాయక్ గార్లను ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డ్ కమిటీ వారు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు గారు వారిని అభినందించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కొండా వీరయ్య, బాచిన రఘు, సుబ్బారావు, అంజినాయక్, సాంబశివనాయక్, కోటేశ్వరరావు నాయక్, కుల్లి చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.



