చిలకలూరిపేట నియోజకవర్గ – మహానాడు
తెలుగు నేల పులకించేలా…పసుపు జెండా రెపరెపలాడేలా…
మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి అధ్వర్యంలో (20.05.2025) మంగళవారం సాయత్రం 4:00 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు నియోజకవర్గ “మహానాడు” కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవి కుమార్ గారు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారు పాల్గొననున్నారు. కావున ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రాష్ట్ర,జిల్లా,పార్లమెంట్ మరియు నియోజకవర్గ, మండల,టౌన్, వార్డు,గ్రామ లలోని వివిధ హోదాల్లో గల పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు
చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ