పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో, చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ వెనుక గల కాంప్లెక్స్ నందు రెండు తెలుగు రాష్ట్రాల రాధా రంగా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు చెలికొండ ధర్మారావు అలియాస్ బుల్లెట్ ధర్మారావు ఆదేశాల ప్రకారం నేడు పట్టణంలో రాధా రంగా మిత్రమండలి నూతన కార్యాలయం చిలకలూరిపేట నియోజకవర్గ రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చు కోల మురళీకృష్ణ మాట్లాడుతూ ..బడుగు బలహీన వర్గాల వారి కోసం వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో త్యాగాలను ,మరెన్నో ఉద్యమాలను చేపట్టినటువంటి రాధా రంగ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే నాయకులన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ఈ మిత్ర మండలి కార్యాచరణను రాబోయే కాలంలో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు, నిరుపేదలకు కుల మతాలకు పార్టీలకు అతీతంగా తమ మిత్రమండలి సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా త్వరలో నియోజకవర్గస్థాయిలో కమిటీ నియామకాలను నియమించినట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎం రాధాకృష్ణ, జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర కాపు నాయకులు మల్లెల శివ నాగేశ్వరావు, పల్నాడు జిల్లా ఎస్సీ నాయకులు అందెల శౌరి, జనసేన పార్టీ నాయకులు గోవిందు గణేష్, గిరిజన సంఘం నాయకులు శ్రీను నాయక్, రాష్ట్ర కాపునాడు నాయకులు తోట శ్రీనివాసరావు, అంకిరెడ్డి రమేషు, వట్టెం శ్రీనివాసరావు, ఏనుగుల వెంకటేశ్వర్లు, తోట సతీష్,. తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.
Trending
- ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డది.
- సంబరాలు చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నాయకులు
- చిలకలూరిపేట నియోజవర్గ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ లో పాల్గొన్న బిజెపి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
- చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార వేదిక లొ పిర్యాదుల వెల్లువ
- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు
- గణపవరం గ్రామంలో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- రూరల్ మండలాల్లో బిజెపి మండల ప్రవాస్ యోజన కార్యక్రమం
- చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన కార్యక్రమం



