ఆపరేషన్ సిందూర్ తో దేశ శక్తిసామర్థ్యాలను మోదీ ప్రపంచానికి చాటిచెప్పారు: మాజీమంత్రి ప్రత్తిపాటి
- ఆపరేషన్ సిందూర్ లో భారత త్రివిధదళాలు చూపిన అసమాన ధైర్యసాహసాలకు యావత్ దేశం గర్విస్తోంది : ప్రత్తిపాటి
- చిలకలూరిపేట పట్టణంలో కోలాహాలంగా సాగిన తిరంగా ర్యాలీ.
- వీధుల్లో మార్మోగిన జైహింద్.. భారత్ మాతాకీ జై నినాదాలు.
అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదశిబిరాల ధ్వంసంతో భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా తీసుకున్న సాహసోపేతమైన చర్యలకు, దేశ రక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు అన్నివేళలా అండగా నిలిచారని ప్రత్తిపాటి చెప్పారు. ఉగ్రదాడిపై భారత్ సాగించిన ఆపరేషన్ సింధూర్ కు మద్ధతుగా పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన తిరంగా ర్యాలీలో కూటమినేతలతో కలిసి ప్రత్తిపాటి ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశాన్ని ఉగ్రవాద రహితంగా తీర్చిదిద్దాలన్నదే మోదీ లక్ష్యం : ప్రత్తిపాటి
26 మంది సాధారణ పౌరులను బలితీసుకున్న ఉగ్రవాదుల దుశ్చర్యకు ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రశిబిరాలపై దాడులు జరిపి100మందికి పైగా ఉగ్రవాదుల్ని అంతంచేయడం దేశానికే గర్వకారణమన్నారు. ఈ చర్యకు కులమతాలు.. ప్రాంతాలకు అతీతంగా దేశమంతా మద్ధతు పలకడం నిజంగా గర్వించాల్సిన విషయమన్నారు. భారత్ తో పెట్టుకుంటే ఎవరైనా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని, ఉగ్రరహిత దేశంగా దేశాన్ని తీర్చిదిద్దాలన్న గొప్ప లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ప్రత్తిపాటి కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ లో భారత త్రివిధ దళాలు చూపిన అసమాన ధైర్య సాహసాలకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోందన్నారు. సరిహద్దుల్లోని అమాయక పౌరుల్ని లక్ష్యంగా చేసుకొని పాక్ జరిపిన దాడుల్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. భారత్ యుద్ధరీతులు, సైనికబలానికి భయపడే పాక్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణకు అంగీకరించిదన్నారు. ఆపరేషన్ సిందూర్ తో ప్రధాని మోదీ దేశాన్ని ఒకతాటిపైకి తెచ్చారని ప్రత్తిపాటి తెలిపారు. తిరంగా యాత్రలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు పోట్రూ పూర్ణచంద్రరావు, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, గంగా శ్రీనివాసరావు, కందుల రమణ, కౌన్సిలర్ లు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, సి.ఐ రమేష్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.