21న డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 21వ తేదీ బుధవారం జరిగే ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో డీఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షులు బి సంపత్ బాబు హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షులు బి,వెంకటేశ్వర్లు, పి ఆర్టియు నాయకులు షేక్ ఖాజావలితెలిపారు,ప్రాథమిక పాఠశాలల పిఎస్ హెచ్ఎం పోస్టును ప్రాథమిక పాఠశాల లో పనిచేస్తున్న సెకండ్ గ్రేట్ టీచర్ కి ప్రమోషన్ ద్వారా వర్తింపజేయాలని,
హై స్కూల్స్ లో 1:45 నిష్పత్తిని కొనసాగించాలని తదుపరి మరొక సెక్షన్ ఏర్పాటు చేయాలని,
సెకండరీ గేట్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని
బేసిక్ ప్రైమరీ పాఠశాల కూడా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, గత 34 సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎటువంటి పరిష్కారం చేయలేనందున గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారితో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు, ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు పోటు శ్రీనివాసరావు వినుకొండ అక్కయ్య కే తిరుపతి స్వామి ,వెంకటేశ్వరరావు. షేక్ మస్తాన్వలి. మేకల కోటేశ్వరరావు బిజెపి ప్రకాష్ ఈ శివరామకృష్ణ, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట బ్రాందీ శాసన ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణం ఎడ్లపాడు చిలకలూరిపేట నాదెండ్ల మండలాల నుంచి అత్యధికంగా ఉపాధ్యాయులు హాజరయ్యాలా ప్రతి ఒక్కరు చర్యలు చేపట్టాలని తెలిపారు, ఉపాధ్యాయ ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారంఅవుతాయని తెలుసుకోవాలని కోరారు

Share.
Leave A Reply