ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నాటిక పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సోమవారం ప్రారంభించారు.

ముందుగా నటరాజ, ఎన్టీఆర్ లకు పూజలు నిర్వహించారు. శివశక్తి లీలా పౌండేషన్ చైర్మన్ లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన సతీమణి మక్కెన పద్మావతి, ప్రభుత్వ న్యాయవాది ముప్పాళ్ళ కల్పన పాల్గొని జ్యోతిని వెలిగించి నాటికల పోటీలను ప్రారంభించారు.

మొదటి రోజు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ బోగీలు నాటిక, ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి కిడ్నాప్ నాటికలను శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మొదటి నాటికగా జనరల్ బోగీలు నాటికలో జయలక్ష్మీ అనే వృద్దురాలు కుమారుడి రైలు ప్రమాదంలో గుర్తించడంలో పోలీసుల తీరును ఆమె ప్రశ్నించడం చూపరులను ఎంతగానో మంత్ర ముగ్దలని చేసింది ఆదేవింగా జనరల్ బోగీలో ప్రయానించే ప్రయానికులకు గుర్తింపు ఇవ్వలని, తన కోడుకులా మరోకరు ఇబ్బందులు పడకూడదని, ఇప్పటికైనా రైల్వే అధికారులు రిజర్వేషన్ బోగీలతో పాటు జనరల్ బోగీలను పెంచాలని సందేశం ఆకట్టుకుంది. పోటీలను పట్టణంలోని యువత, విద్యార్థులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకిం చారు.

పోటీలను ప్రభుత్వ చీప్ విప్ జి.వి, మాజీ ఎమ్మెల్యేలు సతీసమేతంగా పోటీలను తిలకించారు.

Share.
Leave A Reply