Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేట:పట్టణంలోని కొమరవల్లిపాడులో వేంచేసియున్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రాచీన కాలం నుంచి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. 1712వ సంవత్సరంలో చిలకలూరిపేట జమీందారులైన రాజామానూరి వంశీకులు ఆలయాన్ని నిర్మించారు. పట్టణానికి పక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక ఇంట్లో కాకర పొద తవ్వుతుండగా స్వామివారి విగ్రహం దొరికినదని నానుడి. ఈ విగ్రహాన్ని యడ్లపాడు మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటలో ప్రతిష్టించేందుకు తీసుకువెళుతుండగా కొమరవల్లిపాడు చేరుకోగానే అక్కడ నుంచి స్వామివారు కదలలేదని ఆ రాత్రి కలలో జమీందార్‌కు కనిపించి ఇక్కడే ప్రతిష్టించమని కోరినట్లు ఆలయ చరిత్ర తెలుపుతున్నది. దీంతో స్వామివారి విగ్రహంతోపాటు జమీందారుల ఇలవేల్పు అయిన శ్రీఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. దీంతోపాటుగా స్వామివారికి పెద్దరథం నిర్మించారు. పెద్దరథం నిలిపేందుకు గడియారం స్థంబం సెంటర్‌లో 1918వ సంవత్సరంలో పెద్దరథశాల నిర్మించారు. అప్పటి నుంచి స్వామివారు ఒకచేత శంఖాన్ని, మరోచేత చక్రాన్ని ధరించి లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ పాలక వర్గ సభ్యులైన గోరంట్ల బాపయ్య 1986లో గాలిగోపురం…

Read More

ప్రజల అభివృద్ధికి సమాచారమే పునాది. ముఖ్యంగా స్థానిక సమాచారం సక్రమంగా అందకపోతే ప్రజలు తమ హక్కులు, అవకాశాలు గురించి పూర్తిగా తెలుసుకోలేరు. ‘చిలకలూరిపేట లోకల్ న్యూస్’ అనే వెబ్‌సైట్‌ ఏర్పాటు చెందింది ఇదే అవసరాన్ని గుర్తించి – చిలకలూరిపేట పట్టణానికి సంబంధించిన వార్తలు, సంఘటనలు, విశేషాలు, ప్రభుత్వ సమాచారాన్ని నిఖార్సైన నిజాయితీతో ప్రజల ముందుకు తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ వెబ్‌సైట్ ఒక వార్తా వేదిక మాత్రమే కాదు – ఇది చిలకలూరిపేట ప్రజల గొంతుక, అనుభూతుల అద్దం, స్థానిక ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు రూపం. చిన్న విషయమైనా సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తే, అది మా వార్తల్లో ప్రాధాన్యత పొందుతుంది. చిన్న వ్యాపారులు, యువత, మహిళలు, ఉద్యోగార్థులు, వృద్ధులు – ప్రతి వర్గానికి ఉపయుక్తమైన సమాచారం అందించాలన్నదే మా సంకల్పం. ప్రపంచం ఎంత విస్తరించినా, ప్రతి మనిషికి తన ప్రాంతం, తన గడప ముందర జరిగే సంగతులే ముందుగా…

Read More

మాచర్లలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఈ సోమవారం (12.05.2025) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మాచర్ల పట్టణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. సోమవారం ఉదయం 10.00 గం.లకు నెహ్రూ నగర్ లోని వివియన్ గార్డెన్స్ నందు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నియోజక వర్గాల స్థాయిలో నిర్వహించదలిచామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే చిలకలూరి పేట, నరసరావు పేట నియోజక వర్గాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పుడు మాచర్లలో పీజీఆర్ఎస్ అవకాశాన్ని నియోజక ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read More

రైతుల ధర్నా—-రైతుల ధర్నా యడ్లపాడు మండలం తహసీల్దారు కార్యాలయం వద్ద 12-05-2025 , సోమవారం, ఉదయం 10 గంటలకు రైతుల ధర్నా .రైతులు, రైతునాయకులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రైతుల పంటలకు న్యాయమైన ధరరావాలనే వారంతా ధర్నా లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.మన కోర్కెలు

Read More

శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు నాదెండ్ల మండలం జంగాలపల్లి లో వైఎస్ఆర్సిపి కు చెందిన శ్రీకాంత్ రెడ్డిని చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి ఆదివారం చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు. శ్రీకాంత్ రెడ్డి కి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి. మూడు రోజుల్లో సూరీటీ లు సమర్పించవలసిందిగా ఆదేశించినట్లు తెలిసింది…

Read More

[5:14 PM, 5/11/2025] aapstatekapunadu99: పల్నాడు జిల్లా పోలీస్ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి SRKT నందు కార్డెన్ సెర్చ్ … నరసరావుపేట డి.ఎస్.పి అయిన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 సిఐ లు,14 మంది ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు ANS సిబ్బందితో కలిసి ఈరోజు తెల్లవారుఝామున 4.30 గంటల నుండి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు… ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు …ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు … నరసరావుపేట రూరల్ పోలీస్టేషన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్…

Read More

చిలకలూరిపేట మండలం, కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుత్తా శ్రీనివాసరావు గారి కుమారుని వివాహం సందర్భంగా ఈరోజు వారి ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా అక్కడికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ గారు , గ్రామ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Read More

చిలకలూరిపేట పట్టణం, 32వ వార్డు నందు దార్ల వెంకటేశ్వర్లు గారి కుమార్తె వివాహ ప్రధానం కార్యక్రమానికి విచ్చేసి కాబోయే నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో జువ్వాజి మదన్ మోహన్ గారు, రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, జంగా వినాయకరావు గారు,అవ్వరు రమేష్ గారు, బిట్ర బ్రహ్మంగారు, కుమారి గారు పలువురు ఆశీర్వదించారు.

Read More

చిలకలూరిపేట పట్టణం, నరసరావుపేట సెంటర్ వద్ద ఉన్న ఐ టి సి టొబాకో కంపెనీ వద్ద ఈశ్వర్ వరప్రసాద్ (ITC బాబు) గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో జువ్వజి మదన్ మోహన్ గారు, చింతకాయల కోటేశ్వరరావు గారు పలువురు విచ్చేశారు.

Read More

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలి -ఎస్టియు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు బదిలీలు జరగబోయే నేపథ్యంలో బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నట్లు ఎస్టియు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు ఎస్టియు డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా బదిలీలలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండే విధంగామరియు 120 రోలు దాటిన ప్రతి పాఠశాలకు ఒక పిఎస్ హెచ్ఎం అయిదుగురు టీచర్లు ఉండే విధంగా బదిలీలు నిర్వహించాలని కోరారు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 గా నిర్ణయించాలని కోరారు,రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 అర్బన్ లోకల్ బాడీ మున్సిపల్ పాఠశాలలో మున్సిపల్ మేనేజ్మెంట్లో అప్ గ్రేడ్ అయిన స్కూల్స్ మరియు 75/100 రోల్ హై స్కూల్స్ కి హెచ్ఎం మరియు స్కూల్…

Read More