కూటమిప్రభుత్వంలో వాణిజ్య, వ్యాపార వర్గాలవారు ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంతంగా తమ కార్యకలాపాలు సాగించుకునే స్నేహపూర్వక సత్సంబంధాలు ఉన్నాయని, గతంలో మాదిరి వేధింపులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు స్థానం లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణమండపంలో జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్ష, కార్యదర్శులు, కొత్తమసు శ్రీనివాసరావు ,అరెకట్ల కోటేశ్వరరావు, కొప్పురావూరి రాధాకృష్ణ, సభ్యులతో ప్రత్తిపాటి ప్రమాణం చేయించచారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అన్నివర్గాల వారు ఉన్నారని, కూటమిప్రభుత్వంలో వ్యాపారులకు అవసరమైన అన్ని సహాయసహకారాలు అందుతాయని ప్రత్తిపాటి తెలిపారు. వ్యాపారులు ఎలాంటి అభద్రతాభావానికి లోనుకాకుండా తమ పనులు చేసుకోవచ్చన్నారు. గతంలో నియోజకవర్గంలో వ్యాపారుల్ని, ప్రజల్ని భయపెట్టిన వారు ఇప్పుడు కనిపించకుండా పోయారని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. వ్యాపారులు కష్టపడి పనిచేసుకోవడంతో పాటు, తమ సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు వెచ్చించాలని, వివిధ మార్గాల్లో పదిమందికి సాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రత్తిపాటి సూచించారు. రాజకీయాలు, వర్గాలకు, అభిప్రాయబేధాలకు అతీతంగా ఛాంబర్ కామర్స్ కార్యకలాపాలు కొనసాగాలని ప్రత్తిపాటి వ్యాపారులకు సూచించా రు. ప్రభుత్వం వ్యాపార, వాణిజ్యవర్గాలకు అనేక అవకాశాలు కల్పిస్తోందన్న ప్రత్తిపాటి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా వ్యాపారరంగంలో అడుగుపెట్టాలనుకునేవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, కందుల రమణ, వక్కలగడ్డ భాస్కర్ రావు, యేల్చురి వెంకటేశ్వర్లు, వెల్లంపల్లి రవి శంకర్, కనమర్లపూడి రమేష్, మురకొండ మల్లిబాబు, గట్టినేని రమేష్, తుబాటి శ్రీహరి తదితరులున్నారు.

Share.
Leave A Reply