టిడ్కో గృహస్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం: ప్రత్తిపాటి

  • రూ.3.60 కోట్లతో 30 గదుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాం.
  • స్థానికంగా నివాసముంటూ, ఉపాధి లేని వారికే ఈ షాపులు కేటాయిస్తాం.
  • దుకాణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీమంత్రి.

5,520 టిడ్కో గృహాల్లో నివసించే పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేలా, స్థానికంగా నివసించే కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించేలా 52 ఎకరాల్లో నిర్మితమైన టిడ్కో ప్రాంగణంలోనే అధునాతన దుకాణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం ఆయన చిలకలూరిపేట పట్టణ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద రూ.3.60 కోట్లతో నిర్మించ తలపెట్టిన దుకాణ సముదాయ నిర్మాణానికి (షాపింగ్ కాంప్లెక్స్) శంకుస్థాపన చేశారు. అనంతరం టిడ్కో గృహాలను పరిశీలించి, నివాసముంటున్న వారితో మాట్లాడిన ప్రత్తిపాటి వారు తెలియచేసిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రూ.3.60 కోట్లతో 30 దుకాణాలతో నూతన షాపింగ్ కాంప్లెక్స్

5,520 కుటుంబాలకు ఉపయోగపడేలా రూ.3.60 కోట్లతో 30 షాపులు వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఈ షాపులను స్థానికంగ నివసించే వారికే అందించే ఆలోచన చేస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. టిడ్కో గృహాల్లో ఉండేవారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ ను 6 నెలల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్టు ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కౌన్సిలర్ జంగా సుజాత, బేరింగ్ మౌలాలి, పాములపాటి శివమ్మ, టీడీపీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, మున్సిపల్ డి.ఈ అబ్దుల్ రహీమ్ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply