రామ భక్త హనుమంతుడి పుట్టిన రోజుగా ఈ రోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వాసం ప్రకారం బజరంగబలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అంతేకాదు అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందుతాడు. హనుమాన్ జయంతి సోదరభావం, ఐక్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే హనుమంతుడి భక్తులందరూ కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
హనుమంతుడి జయంతి రోజున పొద్దున్నే నిద్రలేచి హనుమంతుడిని స్మరించుకుని ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించండి. దినచర్యలు ముగించుకున్న తర్వాత ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయండి. గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. ఎరుపు రంగు పూలు, పండ్లు, ధూపం, దీపం, సింధూరం మొదలైన వాటితో హనుమంతుడిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాణ్ పఠిస్తే హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. అంతేకాదు సుందరకాండ పఠించడం అత్యంత ఫల వంతం. హారతిని ఇచ్చి పూజ ముగించి.. ఆనందం, శ్రేయస్సు, బలం, తెలివి, జ్ఞానం, శక్తి ఇవ్వమని బజరంగబలిని ప్రార్థించాలి.
Trending
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు
- వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్