కొండవీడు ఉత్సవాల ముగింపు ప్రత్యేక కథనం
చరిత్రను వర్తమానానికి అన్వయించి.. కొండవీడు ఉత్సవాల నిర్వహణతో ప్రత్తిపాటి తన సమర్థత చాటుకున్నారు : బీసీ జనార్ధన్ రెడ్డి
14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించిన కొండవీడు కోటను ప్రత్తిపాటి నేడు పునర్నిర్మించారు : డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
- గతాన్ని మరవకుండా. వర్తమానాన్ని సంతోషంగా మార్చుకోవాలన్నముఖ్యమంత్రి సూచనను ప్రత్తిపాటి ఆచరణలో నిజం చేశారు. : బీసీ జనార్ధన్ రెడ్డి.
- జనం.. జనం..ప్రభంజనం, ఉత్సవాల్లో ఎటుచూసినా జనమే : బీసీ జనార్ధన్ రెడ్డి.
- 14 వ శతాబ్దంలో ప్రోలయ వేమారెడ్డి కొండవీడును నిర్మిస్తే..నేడు ప్రత్తిపాటి దాన్ని పునర్నిర్మించారు : డిప్యూటీ స్పీకర్ రఘురామ.
- పల్నాటి కొండవీటి సింహం ప్రత్తిపాటి : రఘురామ.
- పల్నాటి యుద్ధం.. మినీ మహాభారతం. గొప్ప చరిత్ర సంరక్షణలో ప్రత్తిపాటి పల్నాడు గడ్డపైనే మేటిగా నిలిచారు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి.
- ఈసారి జరిగే ఉత్సవాల్లో ప్రజలకు రెట్టింపు ఆనందం, అంతులేని ఉత్సాహం అందిస్తాం : ప్రత్తిపాటి.
- కొండవీడు ఘాట్ రోడ్ నిర్మాణంలో ప్రత్తిపాటి కష్టం ఎంతో ఉంది : హిమాంశు శుక్లా ( నెల్లూరు కలెక్టర్).
- ఆనాడు ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేయబట్టే..నేడు ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం : హిమాంశు శుక్లా.
మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు తరచూచెప్పే మాటను మాజీమంత్రి ప్రత్తిపాటి ఆచరణసాధ్యం చేశారని, గతాన్ని విస్మరించకుండా, ఆ జ్ఞాపకాలు, అనుభవాలతో వర్తమానాన్ని సంతోషంగా మార్చుకోవాలనే సీఎం సూచనను కొండవీడు ఉత్సవాల నిర్వహణతో ప్రత్తిపాటి నిజం చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి అంబరాన్నంటేలా సాగిన కొండవీడు ముగింపు ఉత్సవాల వేడుకకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో కొండపైకి వెళ్లడానికి మంత్రి, డిప్యూటీ స్పీకర్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు రాత్రికి కొండపైకి చేరుకొని గీతామాధరి గానకచేరి, కాంతారా ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల్ని వారు వీక్షించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ సింమంటి చిన్నోడే.. వేటకొచ్చాడే పాటకు స్టెప్పులేసి యువతను ఉర్రూతలూగించారు. చివరి నిమిషంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ వేడుకలకు విచ్చేసి, అధికారులకు కనిపించి వెనుదిరిగారు. కార్యక్రమాల వీక్షించిన తర్వాత మంత్రి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు పర్యాటకుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఎటు చూసినా, జనంజనం.. ప్రభంజనం : జనార్ధన్ రెడ్డి
కొండవీడు ఉత్సవాలకు రావాల్సిందేనని ప్రత్తిపాటి గట్టిగా పట్టుబట్టారని, ఆయన కోరిక మన్నించి ముగింపు వేడులకు వస్తే, ఇక్కడ ఎటుచూసినా జనం..జనం..ప్రభంజనమే కనిపించిందని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. కొండపైకి రావడానికే మాకు 2 గంటలకు పైగా సమయం పట్టిందని జనార్థన్ రెడ్డి చెప్పారు. కష్టపడి వచ్చిన మాకు.. ఇక్కడి కార్యక్రమాలు.. జనాల ఉత్సాహం చూశాక ఎక్కడలేని సంతోషం కలిగిందన్నారు.
పల్నాటి కొండవీటి సింహం ప్రత్తిపాటి : డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు
14 వ శతాబ్దంలో రాజు ప్రోలయ వేమారెడ్డి కొండవీడు కోటను అద్భుతంగా నిర్మిస్తే.. నేడు పల్నాటి ప్రాంత కొండవీటి సింహం ప్రత్తిపాటి దాన్ని పునర్నిర్మించారని అసెంబ్లీ డిప్యూటీ స స్పీకర్ రఘురామకృష్ణరాజు కొనియాడారు. కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు, అనుమతుల సాధనకోసం ప్రత్తిపాటి ఆనాడు పడిన కష్టాన్ని నేడు చెబుతుంటే.. తనకే ఆశ్చర్యమేసిందన్నారు. ఈ ప్రాంతానికి ఇంత విశిష్టత.. ఈ ఉత్సవాలకు ఇంతటి వైభవం వచ్చాయంటే నాడు టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహకారంతో ప్రత్తిపాటి నిర్మించిన ఘాట్ రోడ్డే కారణమని రఘురామ స్పష్టంచేశారు. ఈ ఉత్సవాలపట్ల ప్రజలు చూపిన అదరాభిమానాలు.. తమ నాయకుడు ప్రత్తిపాటిపై వారికున్న అభిమానానికి నిదర్శనంగా నిలిచాయన్నారు. గీతామాధురి తన గాత్రంతో యువతను ఉర్రూతలూగించారని, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బుర పరిచాయన్నారు. కొండవీడు ఫెస్ట్ -2026 వేడుకలు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా నేత్రత్వంలో అధికారయంత్రాంగం అద్భుతంగా నిర్వహించారని రఘురామ కొనియాడారు.
కొండవీడు ఫెస్ట్ – అంతులేని ఆనందాల ఫీస్ట్ : మాజీమంత్రి ప్రత్తిపాటి
రెండ్రోజుల పాటు నిర్వహించిన కొండవీడు ఉత్సవాలు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, వచ్చే ఏడాది ఉత్సవాల్లో ఇంతకు రెట్టింపు ఆనందం, ఉత్సాహం అందిస్తామని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. కొండవీడు ఫెస్ట్ .. పర్యాటకులకు అంతులేని ఆనందాల ఫీస్ట్ అందించిందన్నారు. ఉత్సవాలను ఇంతటి ఘనంగా నిర్వహించి, ప్రతి ఒక్కరి సంతోషానికి కారకులైన జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, ఇతర ప్రధానాధికారులు. నిర్వాహకులకు, కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినీవిద్యార్థులు, యువతకు, సినీ సంగీత కళాకారులకు, పటిష్టమైన బందోబస్త్ తో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన పోలీస్ వారికి ప్రత్తిపాటి సభాముఖంగా ప్ర్యతేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేశారు.
పల్నాటి ప్రాంత చరిత్ర సంరక్షణలో ప్రత్తిపాటి మేటిగా నిలిచారు : ఎమ్మెల్యే జూలకంటి
పల్నాడంటేనే ఘనచరిత్రని, పల్నాటి యుద్ధం ఒక మినీ మహాభారతమని, అంతటి ఘన చరిత్ర కలిగిన ప్రాంతవాసులమైన మనందరం మన చరిత్రను సంరంక్షించుకోకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అభిప్రాయపడ్డారు. మనదైన చరిత్ర సంరక్షణలో మాజీమంత్రి ప్రత్తిపాటి…తనకు తానే మేటిగా నిలిచారని, ఈ ప్రాంత నాయకులకే ఆదర్శంగా నిలిచారని జూలకంటి ప్రశంసించారు. కొండవీడు ఖ్యాతి ఉన్నంతవరకు..ప్రత్తిపాటి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఉత్సవాలు ప్రజల మదిలో నిలిచిపోతాయన్నారు. భవిష్యత్ లో మన ప్రాంతంలో బుద్ధ భగవానుడు నడయాడిన నేల అయిన నాగార్జున సాగర్ చరిత్ర. పల్నాటి ప్రాంత వైభవాన్ని దశదిశలా వ్యాపింపచేసేం దుకు కూటమి ప్రభుత్వం సహకరించాలన్నారు.
కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం ప్రత్తిపాటి ఎంతో కష్టపడ్డారు: హిమాంశు శుక్లా ( నెల్లూరు జిల్లా కలెక్టర్)
2016లో తొలిసారి ఇక్కడకు వచ్చామని, నాడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తితో ఈ కొండపైకి నడిచి వచ్చామని, అప్పుటికీ..ఇప్పటికీ ఇక్కడ చేసిన అభివృద్ధి చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియచేశారు. ఆనాడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి.. కొండవీడుకోటపైకి ఘాట్ రోడ్డు నిర్మించడంకోసం సంబంధిత శాఖలన్నింటిని సంప్రదించి, అధికారులందరి చుట్టూ తిరిగి, ఎట్టకేలకు నాటి..నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో అనుకున్నది సాధించారని హిమాంశు శుక్లా నాటి సంఘటనలు వివరించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తనకు తానే సాటి అని ప్రత్తిపాటి నిరూపించుకున్నారన్నారు. ఆనాడు ఆయన కృషి వల్లే నేడు ఈ ఉత్సవాలను ఇంత సంతోషంగా జరుపుకున్నట్టు చెప్పారు.
అంబరాన్నంటిన ముగింపు వేడుకలు.. గాయని గీతామాధురి స్వరం.. చిన్నారుల నృత్యప్రదర్శనలకు పాదం కలిపిన మంత్రి, ప్రజాప్రతినిధులు.. అధికారులు.
బాలయ్య పాటకు స్టెప్పులేసి యువతను ఉర్రూతలూగించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ జనాలు భారీగా తరలిరావడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను స్వయంగా క్లియర్ చేసిన ప్రత్తిపాటి.. రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ
కొండవీడు ఉత్సవాలు ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. కొండపైన ఉన్నామా.. లేక మరేదైనా లోకంలో ఉన్నామా అనిపించేంతలా రంగురంగుల విద్యుత్ దీపకాంతులు.. చిన్నారుల నృత్యప్రదర్శనలు.. గీతామాధురి గానకచేరి, కాంతారా ప్రదర్శన వంటివి పర్యాటకుల్ని అమితంగా ఆకర్షించాయి. కూర్చున్నచోటి నుంచి లేవకుండా సందర్శకులు సాంస్కృతిక ప్రదర్శనల వీక్షణలో మునిగిపోయారు. కొండవీడు ఉత్సవాల ముగింపు వేడుకలకు తరలివచ్చిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్సీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి, జూలకంటి, పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా, నెల్లూరు కలెక్టర్ హిమాంశ్ శుక్లా (కృతికా శుక్లా భర్త)లు, ప్రధానాధికారులు కూడా పర్యాటకులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. క్షణం తీరికలేని పరిస్థితులున్నప్పటికీ అక్కడి ఆనందోత్సాహాల వాతావరణం చూశాక..వారు తమ పాదం కదపకుండా ఉండలేకపోయారు.
ఆదివారం అర్థరాత్రి వరకు అట్టహాసంగా సాగిన వేడుకలు, చిన్నారులు..యువత కేరింతలతో ముగింపు సంబరాలు మిన్నంటాయి. ఏదైనా దేశంలో కొత్త సంవత్సర వేడుకల్లో ఉన్నామా అనిపించేంతలా నిర్వాహకులు చివరిలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది.
డాన్సర్లతో కలిసి హీరో నందమూరి బాలయ్య సింహమటి చిన్నోడే గీతానికి స్టెప్పులు వేసిన రఘురామ, ఎమ్మెల్యే జూలకంటి.. ఉత్సవాలకు విచ్చేసిన ప్రజలు, పర్యాటకుల్ని ఉత్సాహపరిచి, వారితో కేరింతలు కొట్టించారు. సినీగాయని గీతామాధురి గాత్రానికి అనుగుణంగా పాదం, పెదవులు కదుపుతూ రఘురామ ఉల్లాసంగా కనిపించారు. ముగింపు వేడుకల వేదికపైనే కలెక్టర్లు హిమాంశు శుక్లా, కృతికా శుక్లా దంపతులకు మంత్రి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, అధికారులు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. వేడుకలకు తరలివచ్చిన అశేష జనసందోహంతో కొండపైనుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి వెళ్లే వాహనాలతో ఒకదశలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీస్ శాఖ చర్యలకు తమవంతుగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. అదే సమయంలో కొండపైనుంచి కిందకు వస్తున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ తన కారులో నుంచి దిగి, ఎమ్మెల్యేతో కలిసి ట్రాఫిక్ తొలగింపులో పాల్గొన్నారు. వాహనాలు కదిలి వెళ్లిన అనంతరం ప్రత్తిపాటి.. కృష్ణ తేజతో మాట్లాడి, ఆయనకు వీడ్కోలు పలికారు.



