అన్నదానానికి భారీ విరాళం

పురుషోత్తమ పట్నం సాయిబాబా మందిరానికి50,000నగదు అందజేత

చిలకలూరిపేట పట్టణంలో ని12వ వార్డ్ టీడీపీ నాయకులు తుళ్లూరి సాంబయ్యఆదిలక్ష్మి దంపతుల 60వ వివాహా మహోత్సవం సందర్భంగా స్థానిక పురుషోత్తమ పట్నం లో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీసాయి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మందిర ప్రధాన అర్చకులు మురికిపుడి లక్ష్మీ నారాయణ ,దంపతులు పేరు మీద అర్చన చేశారు.

అనంతరం సాంబయ్య ఆదిలక్ష్మి దంపతులు సాయిబాబా మందిరంలో భక్తులకు అన్నదాన నిమిత్తం50000రూపాయల ను ఆర్థిక సహాయం అందించారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు కు ఈ50000ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు.

అదేవిధంగా పట్టణంలో ని చీరాల రోడ్డు లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులు కు అన్నదనం పంపిణీ చేశారు.

అన్నదానికి ఆర్థిక సహాయాన్ని అందించిన తుళ్ళూరి సాంబయ్య ఆదిలక్ష్మి దంపతులు ను పలువురు ప్రముఖులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉప్పాలబాజి, ఉప్పాల సుభాని, ఉప్పాల సురేష్, తాత దుర్గ, హేమంత్, శ్రావ్య కుటుంబసభ్యులు పాల్గొన్నారు

Share.
Leave A Reply