యూట్యూబ్ న్యూస్ చానల్స్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలి.

YJA.ఏపీ అసోసియేషన్ పల్నాడు జిల్లా కమిటీ

జిల్లాలో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు,జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులకు వినతి పత్రాలు అందజేసిన పల్నాడు జిల్లా కమిటీ నాయకులు.

యూట్యూబ్ న్యూస్ చానల్స్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి,

అక్రిడేషన్ కమిటీలో అవకాశం కల్పయించాలి.

పల్నాడు జిల్లా //యూట్యూబ్ న్యూస్ చానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వల్లూరు. మధు సుధను రావు గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు గారికి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారికి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి,
పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి,
యూట్యూబ్ న్యూస్ చానల్స్ జర్నలిస్టుల సమస్యలపై పల్నాడు జిల్లా లో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులకు,మెమోరాండం ఇవ్వటం జరిగింది.ఆంధప్రదేశ్ వ్యాప్తంగా యూట్యూబ్ ని చానల్స్ నడుపుతూ యాజమాన్యాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని కావున యూట్యూబ్ ఛానల్స్ ని గుర్తించి అక్రిడేషన్ కార్డులు, ప్రభుత్వ రాయితీలు మరియు ఇంటి స్థలాలు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అదే విధంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అక్రిడేషన్ కమిటీ లోకి యూట్యూబ్ న్యూస్ చానల్స్ కు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా యూట్యూబ్ న్యూస్ చానల్స్ పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ కుమార్ మరియు జిల్లా ప్రెసిడెంట్ షాహిద్ పలువురు జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply