చిలకలూరిపేట పట్టణములో సి.ఆర్ క్లబ్ నందు నడుపబడుతున్న న్యూ షావోలిన్ కుంగూ ఫు అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్ధాయి ఊషు పోటీల్లో విజేతలుగా నిలిచి జూన్ నెలలో జైపూర్లో జరగనున్న జాతీయస్థాయికి ఉషు పోటీలకు ఎంపికయిన విద్యార్థులను శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. ప్రతి తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకొని విద్యార్ధినీ విద్యార్థులు సెల్ఫ్ డిఫన్స్ లో అలాగే ప్రభుత్వంచే గుర్తించబడిన ఆటల పోటీల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. ఏ.పి డిప్యూటి సి.యం పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ఆడపిల్లలపై ఈ సమాజంలో జరుగుతున్న దాడుల నుండి రక్షణ కొరకు ఆడపిల్లలకు, మహిళలకు కుంగ్ ఫు , కరాటే, ఉషు విద్యలు నేర్పించాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే మన చిలకలూరిపేట పట్టణంలో ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఊషు క్రీడను మన పల్నాడు జిల్లా తరుపున మన స్థానిక సి.ఆర్ క్లబ్లో నేర్పిస్తున్న న్యూ షావోలిన్ కుంగూ ఫు అకాడమీ మాస్టర్స్. వీరు ఉచితముగా మార్షల్ ఆర్ట్స్ లో 9 సవత్సరములుగా శిక్షణ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం, విరిని ప్రోత్సహించి, అందరిస్తున్న
న్యూ షావోలిన్ కుంగూ ఫు అకాడమీ గౌరవ అధ్యక్షులు మద్దుల వెంకట కోటయ్యని అభినందించారు అలాగూనే జాతీయ స్థాయికి వెళుతున్న బత్తుల విక్రమ్, పాలపాటి నాగరాజు, షేక్ రబ్బాని,య.మ్ దుర్గ ప్రసాద్, బత్తుల అభి, షేక్.తన్విర్,జి.గగన్…విద్యార్థులకు స్టేట్ మెడల్స్ అందజేశి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ చీఫ్ యస్.కె.దరియా వలి, మాస్టర్ యడ్ల సురేష్,కుర్చేటి బ్రహ్మయ్య, కాకి ప్రసాద్, బ్లాక్ బెల్టర్స్సాకేత్,ఖమృద్దీన్,పాల్గొన్నారు.

Share.
Leave A Reply