కన్నప్రేమ కన్నీటి వేదనకు.. MLA ‘పుల్లారావు’ అభయం
● కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి అండగా చిలకలూరిపేట ఎమ్మెల్యే
● రూ. 30 లక్షల ఆపరేషన్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ
● ‘ఆయన మాకు దైవంతో సమానం’ – కన్నీటి పర్యంతమైన తల్లి రమాదేవి
చిలకలూరిపేట:
కన్నకొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, కిడ్నీలు ఫెయిల్ అయ్యి మృత్యువుతో పోరాడుతున్నాడని ఆ తల్లి పడుతున్న ఆవేదన కలచివేసింది. సుమారు రూ. 30 లక్షల ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక, “నా బిడ్డను కాపాడండి” అంటూ చేతులెత్తి మొక్కుతున్న రమాదేవి అనే తల్లి కన్నీటి గాథ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును కదిలించింది..
ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తుంది
ఆపరేషన్ నిమిత్తం అయ్యే రూ. 30 లక్షల ఖర్చుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సానుకూలంగా స్పందించారు. ముందుగా 15 లక్షల వరకు సాయం చేస్తామని హామీ ఇస్తూనే, మిగతా మొత్తాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం తక్షణమే ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ (LOC) తీసుకువస్తే, ఆ మొత్తం ఖర్చును ప్రభుత్వం ద్వారా అందజేసి యువకుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని స్పష్టం చేశారు.
మా బిడ్డకు పునర్జన్మ ఇస్తున్న దైవం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు
చిలకలూరిపేటకు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం. ఆయన సాయాన్ని మేము జీవితాంతం మర్చిపోలేము.”
రమాదేవి, బాధిత యువకుడి తల్లి
ఎమ్మెల్యే చూపిన మానవత్వంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన తీసుకున్న చొరవ అభినందనీయమని స్థానికులు కొనియా డుతున్నారు.



