Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేట పట్టణం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 20వ వార్డు అధ్యక్షులు మద్ది శివశంకర గుప్తా గారు ఇటీవల మృతి చెందగా ఈరోజు పెద్దకర్మ కార్యక్రమం సందర్భంగా అక్కడికి విచ్చేసి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్ గారు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు, గట్టి నేనీ రమేష్ గారు, గంజి పోలయ్య గారు,చేవూరు కృష్ణమూర్తి గారు, రాచుమల్లు సూర్య రావు గారు, షేక్ రఫీ, షేక్ భాషా తదితరులు ఉన్నారు.

Read More

నల్ల బర్లి రైతుల ఆందోళన– రూ 15 వేలు కనీస ధర కల్పించాలని డిమాండ్_ ఎడ్లపాడు రెవిన్యూ కార్యాలయం వద్ద ధర్నా_ తాసిల్దార్ కు వినతి అందజేత నల్ల బర్లి పొగాకు రైతులు సోమవారం గిట్టుబాటు ధర కోసం ఎడ్లపాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కంపెనీలు, ప్రభుత్వం నాణ్యత పేరుతో దిగుబడులను తిరస్కరిస్తూ, ప్రైవేట్ వ్యాపారులకు సైతం విక్రయించనీయకుండా చేస్తున్న చర్యలను నిరసిస్తూ రైతులు తీవ్రంగా విమర్శించారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నాయి. రైతులకు న్యాయం జరిగే వరకు తమ సంఘాలు భరోసాగా వెన్నంటే ఉంటాయని ఆయా సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. గత రెండేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెట్టుబడి, శ్రమకు సరైన లాభం లేని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు…

Read More

SP కంచి శ్రీనివాస్ రావు ను కలిసి న పల్నాడు కో -ఆపరేట్ సొసైటీ బ్యాంక్ ఖాతదారులు చిలకలూరిపేట లో భారీ మోసం 60లక్షల రూపాయలు కట్టించుకొని చేతులెత్తేసిన బ్యాంక్ ఆందోళన వ్యక్త పరుస్తున్న భాదితులు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులవెల్లువ చిలకలూరిపేట పట్టణమునకు చెందిన సువర్ణ లక్ష్మి ఆమె చిలకలూరిపేట కు చెందిన డీకొండ హరి శంకర్ అనే వ్యక్తి (మిలటరీ నందు పని చేసి రిటైర్డ్ అయినాడు) పల్నాడు- కో- ఆపరేట్ – సొసైటీ బ్యాంక్ ఏర్పాటు…

Read More

చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రికి నూతనంగా సూపర్డెంట్ గా నియమితులు అయిన డాక్టర్ శ్రీనివాసరావు ఈరోజు మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆసుపత్రికి తరచుగా ఆసుపత్రి యొక్క స్థితి గతులు తెలుసుకొని డాక్టర్స్ కి , స్టాఫ్ కి ఉన్న సిబ్బంది కి వచ్చే పేషెంట్లు, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ అవసరం అయిన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అలానే ఆసుపత్రికి అవసరం అయిన స్టాఫ్ మరియు వైద్య పరికరాలు గురించి పై అధికారులతో మాట్లాడి అతి త్వరలోనే అందజేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నీటి సమస్యకు చెక్‌ యడ్లపాడు మండలంలో చెంఘీజ్‌ఖాన్‌పేట పంచాయతీ బున్నీనగర్‌లో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట ఆధ్వర్యాన జరిగిన సేవా కార్యక్రమంలో క్లబ్‌ డిస్ట్రిక్‌ చైర్మన్‌ ప్రేమలత హాజరయ్యారు. సోమవారం కాలనీ వాసులకు నీటి సమస్యకు పరిష్కారంగా అసిస్ట్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ప్రేమలత ప్రారంభించారు. అనంతరం క్లబ్‌ బ్రాండింగ్‌లో భాగంగా ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ చిహ్నాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. సమాజ సేవ..పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చిలకలూరిపేట ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ పనిచేస్తుందని ప్రేమలత పేర్కొన్నారు. క్లబ్‌ అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, మహిళాభివృద్ధి కోసం క్లబ్‌ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాల విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో దాతలు జాస్టి ప్రమీల, మద్ది లలిత, డాక్టర్‌ గట్టు రంగారావు, డిస్ట్రిక్ట్‌ సెక్రటరీ జయశ్రీ, డిస్ట్రిక్ట్‌ ఎడిటర్‌ సుభాషిణి, పీడీఎస్‌ కోలా విజయలక్ష్మి,…

Read More

చిలకలూరిపేట రూరల్ మండలం, కావూరు గ్రామంలో గుమ్మడితల వీరయ్య గారి కుమారుని వివాహం సందర్భంగా అక్కడికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కోడె హనుమంతరావు గారు, బీసీ నాయకులు తుపాకుల అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు పలువురు గ్రామ నాయకులు విచ్చేశారు.

Read More

చిలకలూరిపేట పట్టణం, 21 వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్ది రామకృష్ణ గారి ఆరోగ్య నిమిత్తం వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి యోగక్షేమాలు తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తుపాకుల అప్పారావు గార, నాగేశ్వరరావు గారు మరియు 21 వ వార్డు కౌన్సిలర్ కరమర్లపూడి లక్ష్మీ తిరుమల గారు, అయినవోలు రాధా గారు,రాచమల్లు సూర్య రావు గారు పలువురు నాయకులు విచ్చేశారు.

Read More

తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా 14 వ వార్డులో కార్యవర్గ ఎన్నిక చిలకలూరిపేట తెలుగుదేశంపార్టీ సమస్థాగత ఎన్నికలలో మాజీ మంత్రి,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షలు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 14 వార్డులో నూతన కార్యవర్గoను ఎన్నుకోవడం జరిగింది.14 వ వార్డుకు అధ్యక్షులుగా బాజీ (Army) , ప్రధాన కార్యదర్శిగా షేక్ బారిసైదా , ఉప అధ్యక్షులుగా పసుపులేటి రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, టీడీపీ కరిముల్లా,పఠాన్ సమద్, మద్దుమల రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా,యూనిట్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ బీడింగ్ కరీముల్లా, బూత్ కన్వీనర్ ఇబ్రహీం,ITDP సభ్యులు అబూబకర్ సిద్ధిఖ్, అన్వర్ పాల్గొన్నారు.

Read More

ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి. గిరిప్రదక్షిణ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి భక్తుడు ప్రసాదు 51 మృతి మృతుడు ప్రసాదు స్వగ్రామం చిలకలూరిపేట పురుషోత్తపట్నం ప్రతి పౌర్ణమి రోజు జరిగే కోటప్పకొండ గిరిప్రదక్షిణ. గుండెపోటు రావడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్న తోటి భక్తులు. భక్తులు స్పందించి CPR చేసిన ఫలితం లేకపోయింది

Read More

చిల‌క‌లూరిపేట‌:సీఆర్ క్ల‌బ్,చిల‌క‌లూరిపేట క‌ళాప‌రిష‌త్‌, సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈనెల 16,17,18 తేదీల‌లో తెలుగు రాష్ట్రాల స్థాయి తొమ్మిద‌వ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. మొద‌టి రోజు శుక్ర‌వారం రాత్రి నాటిక పోటీలు ప్రారంభ‌మౌతాయి. మొద‌టి రోజు నాటిక పోటీల‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్రారంభించ‌నున్నారు. మొద‌టి రోజు హైద‌రాబాద్ క‌ళాంజ‌లి వారి రైతే రాజు నాటిక, చిల‌క‌లూరిపేట కు చెందిన మ‌ద్దుకూరి ఆర్ట్ క్రియేష‌న్ వారి మా ఇంట్లో మ‌హాభార‌తం నాటిక‌, హైద‌రాబాద్ య‌వ‌భేరి వారి నా శ‌త్రువు నాటిక ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. రెండోవ రోజు 17వ తేదీ శ‌నివారం రాత్రి హైద‌రాబాద్ మిత్ర క్రియేష‌న్స్ వారి ఇది ర‌హ‌దారి కాదు నాటిక‌, క‌రీంన‌గ‌ర్ , క‌ళాభార‌తివారి చీక‌టిపువ్వు, విశాఖ‌ప‌ట్నం భ‌ద్రం పౌండేష‌న్ వారి దొందు దొందే నాటిక లు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. మూడో రోజు ఆదివారం 18 తేదీ గుంటూరుకు చెందిన అమ‌రావ‌తి ఆర్డ్స్ వారి చిరుగుమేఘం, చిల‌క‌లూరిపేటకు…

Read More