యడ్లపాడు–1 సచివాలయాన్ని సందర్శించిన తహశీల్దార్‌
– రేషన్‌ కార్డులపై క్షేత్రస్థాయి పరిశీలన

యడ్లపాడు మండల తహశీల్దార్‌ జెట్టి విజయశ్రీ గురువారం యడ్లపాడు–1 సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియపై అక్కడి సిబ్బందితో సమావేశమై దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ణయం తదితర ప్రక్రియలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్‌ కార్డు మంజూరు చేయాలని, అనర్హుల వద్ద నుంచి పథకాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్న విషయాన్ని విస్మరించ వద్దన్నారు. రేషన్‌కార్డుల మంజూరుపై సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఆమె వెంట ఉపతహశీల్దారు అనురాధ, మండల రెవెన్యూ ఇన్సె్పక్టర్‌ సుబ్బారావు, వీఆర్వో కేఏ చారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–6 స్వాతిప్రియ, జీఎంఎస్‌కే రేవతి తదితరులు ఉన్నారు.

Share.
Leave A Reply