- హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రత్తిపాటి
ఆపద్బాంధవుడైన హనుమంతుని మనసారా నమ్మి కొలిచే వారికి ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉండవని, ఆంజనేయుని ఆరాధనతో సకల శుభాలు కలుగుతాయని మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.
హానుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని పురుషోత్తమపట్నం ప్రసన్నాంజ నేయస్వామి, 6వ వార్డులోని ఆంజనేయస్వామి ఆలయాల్లో జరిగిన ప్రత్యేకపూజల్లో ప్రత్తిపాటి పాల్గొన్నారు.
6వ వార్డు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్న అనంతరం అన్నదానాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
వైశాఖమాసంలో వచ్చే హనుమాన్ జయంతి ఎంతో విశిష్టమైనదని, అజేయశక్తికి, అపార భక్తికి ప్రతిరూపమైన ఆంజనేయుని అనుగ్రహం ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయని ప్రత్తిపాటి చెప్పారు. మతాలకు అతీతంగా ఆంజనేయుని పూజించడం గొప్ప శుభపరిణామమన్నారు. ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలని ఆ రామభక్తుని వేడుకున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట, రాజారమేష్, టీడీపీ నాయకులు జవ్వాజి మధన్ మోహన్, బ్రహ్మానందం, బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, తోట బ్రాహ్మస్వాములు, ఏలూరి తిరుపతయ్య, అరె మల్లి, టీడీపీ నాయకులు, తదితరులున్నారు.



