ఇప్పుడు సీజ‌న్ మారింది.. . వానలు మొదలయ్యాయి. వానాకాలంలో వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్‌, మలేరియా, చికెన్‌గున్యా, కామెర్లు, డెంగీ తదితర వ్యాధులు సులబంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
స‌మావేశాలు పెడితే స‌రిపోతుందా..
ప‌ట్టణం గ‌తం కంటే విస్త‌రించింది. గ‌తంలో 34వార్డుల్లోనే పారిశుధ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు 38 వార్డుల సువిశాల‌మైన ప‌ట్ట‌ణం పారిశుధ్య స‌మ‌స్య జ‌ఠిలంగానే ఉంది. సీజ‌న్ వ్యాధుల‌పై మున్సిప‌ల్ అధికారులు స‌మావేశం పెట్టి మ‌మ అని పించారు. ఇంత‌టితో త‌మ ప‌ని అయిపోయింద‌నిపించుకున్నారు. పారిశుద్ద్యంపై నిర్లక్ష్యం వీడాలి. వర్షాలు కురుస్తున్నా అధికారులు పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోకపోవడం, అనేక ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గ‌త ఏడాది డెంగీవ్యాది ల‌క్ష‌ణాల‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ్డారు. కొంత‌మంది మృత్యువాత ప‌డ్డారు. అటువంటి ప‌రిస్థితి త‌లెత్త‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప‌లు ప్రాంతాల్లో నీటి కాలుష్య స‌మ‌స్య ఉంది. లీకుల‌తో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా అవుతుంది. అధికారులు వెంట‌నే స్పందించ‌కుంటే పెను ప్ర‌మాదం పొంచి ఉంది.

వైద్యులు సూచిస్తున్న జాగ్ర‌త్త‌లు ఇవే…
.క‌రోనానే కాదు మ‌నల్ని ఇబ్బంది పెట్టే అనేక వ్యాధులు కాచుకొని ఉంటాయి. కరోనా వైరస్ ఒక‌వైపు మ‌రోసారి వ్యాప్తి చెందుతుంది. మ‌రోవైపు ప్రస్తుత సమయంలో ఎటువంటి ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లూ సోకకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. వర్షాకాలం ఈగలు, దోమల బాధలు ఎక్కువ. కాబట్టి ఇవి దరి చేరే వీలు లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం…చేతులు పూర్తిగా కప్పేలా ఫుల్‌ స్లీవ్స్‌ దుస్తులు వేసుకోవాలి.ఇంటి లోపల, బయట నీరు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి.చల్లదనం, తేమ పలురకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది. కాబట్టి.శరీరం తడి లేకుండా పొడిగా ఉంచుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానానికి యాంటీ ఫంగల్‌ సబ్బులు వాడాలి. వంటకూ, భోజనానికీ ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.కాచి, చల్లార్చి, వడగట్టిన నీళ్లు తాగాలి.

Share.
Leave A Reply