నరసరావుపేటలో ప్రజా సమస్యల ప్రజావేదిక పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ

నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజావేదిక (PGRS) కార్యక్రమన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలను అందుకున్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు ప్రజల సమస్యలు తెలుసుకొనుటకు ప్రజా వేదిక నిర్వహిస్తున్నామని ప్రజా వద్ద నుండి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు వచ్చే నెల నుండి రైతులకు 20.000/- రూపాయల ఆర్ధిక సహాయం స్కూల్ వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000/- రూపాయలు అందించనున్నారని ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం అందించి పక్క గృహాలు కట్టిస్తామని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఎమ్మెల్యే తో కలిసి ప్రజల వద్ద నుండి అర్జీలను అందుకున్నారు

Share.
Leave A Reply