కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ముందుగా మేల్కొవ‌ట‌మే. రానున్న స‌మ‌స్య‌ను ముందుగా గుర్తించి వాటిని ప‌రిష్క‌రించ‌ట‌మే. ఇందుకు అధికారుల‌కు కావ‌ల్సింది ముందు చూపే. ఆ చూపు క‌రువైన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. 2013 అక్టోబ‌ర్‌లో వ‌చ్చిన అకాల‌వ‌ర్షాలు ప‌ట్ట‌ణాన్ని ముంచెత్తాయి. జ‌న‌జీవ‌నం అస్థ‌వ్య‌స్థ‌మైంది. ప‌ట్ట‌ణ న‌డి బొడ్డున గ‌డియార‌స్థంబం సెంట‌ర్‌, మార్కెట్ సెంట‌ర్‌లో సైతం వ‌ర్ష‌పు నీరు దుకాణాల్లో చేరి ల‌క్ష‌లాది రూపాయాల న‌ష్టం మిగిల్సింది. లోత‌ట్టు ప్రాంతాల‌ల్లో గుడిసెలు నీట మునిగి ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు అంతా అయిపోయాక అధికారులు ఇందుకు గ‌ల కార‌ణాలేమిట‌ని ఆరా తీసారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్ర‌ధాన కాల్వ‌ల్లో పూడిక‌లు తీయ‌క‌పోవ‌ట‌మే అని గుర్తించారు. చిన్న‌పాటి వ‌ర్షాల‌కే చిల‌కలూరిపేట ముంపుకు గురౌతుంది. ఇందుకు కార‌ణ‌మేమిటి..? ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది.
ప‌ట్ట‌ణంలో గ‌మ్యం లేని కాల్వ‌లు, కాల్వ‌ల‌ను ఆక్ర‌మించుకొని క‌ట్టిన భ‌వ‌నాలు, పూడిక‌లు తీయ‌క వ‌దిలివేయ‌టం, శిధిల‌మైన కాల్వ‌ల‌తో ప్ర‌జ‌ల జీవణ విధానం అస్త‌వ్య‌స్థ‌మౌతుంది. చిన్న‌పాటి వ‌ర్షానికే కాల్వ‌ల ద్వారా ప‌ట్ట‌ణానికి దూరంగా వెళ్లిపోవ‌ల్సిన వ‌ర‌ద నీరు రోడ్ల‌పైకి, లోత‌ట్టు ప్రాంతాల‌ల్లో ఇళ్ల‌లోకి ప్ర‌వేశించ‌టం ఇక్క‌డ ప‌రిపాటిగా మారుతుంది.
చిలకలూరిపేట మేజర్ పంచాయతీ నుంచి 1964లో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1980లో గ్రేడ్ -2గా, 2001లో గ్రేడ్-1 అప్ గ్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 34 వారులు కలిగి ఉన్న పట్టణం 18.13 చదరపు కిలో మీటర్లు విస్తరించి ఉంది. మూడు గ్రామాల విలీనంతో పట్టణ వైశాల్యం గణనీయంగా పెరగటంతో పాటు 38 వారులకు చేరుకోంది . ప‌ట్ట‌ణాన్ని సుంద‌వ‌నంగా తీర్చిదిద్దాం.. అన్ని వాడల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాం… అంటూ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు కావు ఇప్ప‌డు కావ‌ల్సింది. ప‌ట్ట‌ణంలోని ప్ర‌ధాన కాల్వ‌ల దుస్థితికి కార‌ణ‌మెవ్వ‌రు..? చిల‌క‌లూరిపేట మున్సిపాలిటిగా అవ‌త‌రించి 50 సంవ‌త్స‌రాలు నిండాయి. గ్రేడ్ -1గా ఉన్న ప‌ట్ట‌ణంలో రోజుకు 80 ల‌క్ష‌ల మురుగునీరు విడ‌ద‌లౌతుంది. ప‌ట్ట‌ణంలోనూ, అవ‌స‌ర‌మైతే నిధులు ఖ‌ర్చుపెట్ట‌డానికి పొలాల్లోనూ కాల్వ‌లు నిర్మించి ఎవ‌రికివారు బేష్ అంటూ త‌మ‌కు తామే భూజాలు చ‌రుకుకొనే పెద్ద‌లు అస్థ‌వ్య‌స్థ డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్ద‌టంలో వైఫ‌లం చెందారు.
ప‌ట్ట‌ణంలోని ప్ర‌ధాన కాల్వ‌లు ఏళ్ల నాడే శిదిలావ‌స్త‌కు చేరాయి. జాతీయ ర‌హ‌దారికి ఇరువైపులా ఉన్న ప్ర‌ధాన డ్రైన్లు ఏళ్ల‌నాడే వాటి రూపు కోల్పాయాయి. ఇది ఇలా ఉంటే ప‌ట్ట‌ణంలో ఉన్న 13 ప్ర‌ధాన కాల్వ‌లు సైతం ఆక్ర‌మ‌ణ‌కు గురియ్యాయి. అంటే ఈ ప్రాంతంలో క‌నీసం పూడిక‌లు తీయ‌లేని ప‌రిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేగా ప్ర‌త్తిపాటి పుల్లారావు ఎన్నికైన అనంత‌రం కొంత‌మేర ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి, పూడిక‌లు తీయించ‌టానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది
ఈ ఏడాది వ‌ర్షాలు ఎక్క‌వ‌గా ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న రేకెత్తిస్తున్నాయి. తుఫాన్లు చెప్పిరావు. ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు. ఇప్పుడు జాగ్ర‌త్త‌ప‌డ‌కుంటే పెనుముప్పు త‌ప్ప‌దు.

Share.
Leave A Reply