మున్సిపల్ నిధుల స్వాహాలో విడదల రజనీ పాత్రపై సమగ్ర విచారణ జరిపించండి

  • రూ.35లకల పురపాలకసంఘ నిధుల గోల్ మాల్ లో రజనీ, ఆమె మరిది గోపీలే అసలు లబ్ధిదారులు
  • జీతంపై బతికే సాధారణ ఉద్యోగుల్ని సస్పెన్షన్ పై పునరాలోచన చేయండి
  • ప్రజల సొమ్ము కాజేసిన గంగా భవానీ ఆమె భర్త పవన్ రజనీ కీలక అనుచరులు.
  • వారిని విచారిస్తే రజనీ, ఆమె మరిది గోపి పాత్ర, ప్రమేయం బయటపడుతాయి
  • రైస్ మిల్ పై రేకులు వేసుకోవడానికి రజనీ మరిది రూ.15 లక్షలు కట్టమన్నాడు
  • ప్రజావేదికలో మాజీమంత్రి ప్రత్తిపాటికి ఫిర్యాదుచేసిన మాబు సుభాని.. స్థానికులు, రైస్ మిల్ యజమాని సుబ్బారావు.

ఇటీవల చిలకలూరిపేట మున్సిపాలిటీలో వెలుగుచూసిన నిధుల స్వాహాలో మాజీమంత్రి రజనీ, అమె మరిది గోపిలే అసలు దోషులని, వారి పాత్ర, ప్రమేయం తేలాంటే నిదులు కాజేసి పరారైన ఇక్తుర్తి గంగాభవాని, ఆమె భర్త పవన్ లను విచారించాలని స్థానికుడు షేక్ మాబు సుభాని మరియు స్థానికులు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని కోరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రజావేదిక నిర్వహిం చారు.

Share.
Leave A Reply