చిలకలూరిపేటలో మహా న్యూస్ కి, వాసుకి బాధ్యతలు

ప్రముఖ టీవీ ఛానల్ మహా న్యూస్ కి చిలకలూరిపేట నియోజకవర్గ రిపోర్టర్ గా బాధ్యతలు తీసుకున్న మా మిత్రుడు బొందలపాటి వాసుకి ముందుగా శుభాకాంక్షలు… ఈ సందర్భంగా వాసు, మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, వాసుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా మహా న్యూస్ కి వార్తలు ఇచ్చేలా వాసు తమ బాధ్యతలను నిర్వర్తించాలని భవిష్యత్తులో మహా న్యూస్ లో మరెన్నో బాధ్యతలు తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పుల్లారావు తెలిపారు.

Share.
Leave A Reply