పేటలో బక్రీద్ సందర్భంగా గోవధపై నిషేధం: మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు చిలకలూరిపేట: ఈ నెల 7వ తేదీన జరుపుకోనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు . గోవధను నిషేధిస్తూ, పశు సంరక్షణ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ పి .శ్రీహరి బాబు స్పష్టం చేశారు.యానిమల్ హస్బెండరీ యాక్ట్ నెం.11/1977 మరియు హైకోర్ట్ ఉత్తర్వులు WP 30. 26505 తేదీ 23-12-2005 గోవద నిషేధం చట్టం పశునిషేధిత సంరక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. ఈ చట్టాల ప్రకారం ఆవులను, దూడలను, అలాగే ఇతర ఉపయోగకరమైన పశువులను వధించడం పూర్తిగా నిషేధించబడింది.ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ పి .శ్రీహరి బాబు హెచ్చరించారు. పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రభుత్వ నిబంధనలను…
Author: chilakaluripetalocalnews@gmail.com
మెగా డీఎస్సీ నిర్వహణ కూటమిప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం : మాజీమంత్రి ప్రత్తిపాటి ఎన్నాళ్లుగానో పరీక్షలకు సన్నద్ధమవతున్న లక్షలాది అభ్యర్థులు నేడు జరిగే ఆన్ లైన్ పరీక్షను సమర్థవంతంగా పూర్తిచేయాలి. ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్ష పూర్తిచేసి, తర్వాత జరిగే అన్ని పోటీ పరీక్షలను విజయవంతంగా ముగించాలని ఆశిస్తున్నా. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకొని, నిబంధనల ప్రకారం పరీక్ష పూర్తిచేయాలి. లోకేశ్ ప్రణాళిక.. దూరదృష్టి వల్లే ప్రశాంతంగా మెగా డీఎస్సీ నిర్వహణ తమ ఆశలు… ఆకాంక్షలు గ్రహించి, వాటిని నిజం చేయడానికి కూటమిప్రభుత్వం ఎంతో కృషిచేసిందనే వాస్తవాన్ని డీఎస్సీ అభ్యర్థులు గ్రహించాలి. డీఎస్సీ నిర్వహణకు ఉన్న అడ్డంకులు, ప్రతిబంధకాలను తొలగించేందుకు విద్యార్థి.. ఉపాధ్యాయ సంఘాలతో లోకేశ్ పలుమార్లు చర్చించారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపేలా అధికారయంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేశారు. గత పాలకుల మూర్ఖపు నిర్ణయాలతో గాడితప్పిన రాష్ట్ర విద్యావ్యవస్థను నిలబెట్టేందుకు, విద్యార్థులు..…
భూమికోసం, భుక్తికోసం పేద ప్రజల విముక్తి కోసం సీపీఐపేదల కోసం పోరాడేది కమ్యునిస్టులేసీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్చిలకలూరిపేట:భూమి కోసం, భుక్తి కోసం. పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ కే సొంతమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. బుధవారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలోని రూత్డైక్మెన్ నగర్శాఖ మహాసభలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, సిపిఐ తోనే సమస్యల పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. కమ్యునిజానికి అంతం లేదని పుట్టగొడుల్ల పుట్టుకొచ్చే పార్టీలు అధికారం లేకపోతే కనుమరుగయ్యే పార్టీలు, రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న ఈ రోజుల్లో వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికీ ఓ దిక్సూచి అని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకులను ఎదుర్కొని…
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఎడ్లపాడు మండలం, మైదవోలు గ్రామంలో అసిస్ట్ మరియు ఐటిసి బంగారు భవిష్యత్, సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన IEC పోస్టర్ ఆవిష్కరణ, మొక్కలు నాటడం, ర్యాలీ మరియు రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమంలో మండల పరిషత్ ముఖ్య అధికారులు, MPDO, మరియు ఐటిసి ఫ్యాక్టరీ మేనేజర్ కట్టా. పూర్ణ చందర్ మరియు HR మేనేజర్ బాలాజీ గారు మరియు గ్రామ టీడీపీ నేతలు పోతురాజు గారు పాల్గొనడం జరిగింది.
పేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు, డి ఈ రహీం, మరియు కౌన్సిలర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో, మున్సిపల్ బృందం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటింది.ఈ వన మహోత్సవంలో ప్రజా ప్రతినిధులు స్వయంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. పట్టణ ప్రజలందరూ మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం ద్వారా పచ్చని చిలకలూరిపేట నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మొక్కల పెంపకం అత్యవసరమని వారు తెలిపారు
ఇంట్లో కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి కూలి పనికి వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిన మహిళ అవిశాయి పాలెం గ్రామంలో ఘటననాదెండ్ల మండలం అమిన్ సాహెబ్ పాలెం మలో విద్యుధాఘాతంతో మహిళా మృతి. గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ రాపూరి చెంచమ్మ (45) వేరోకరి ఇంట్లో పనిచేస్తుండగా కరెంట్ షాక్ కు గురైంది. అక్కడికక్కడే మృతి చెందింది.
మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు పర్యావరణ దినోత్సవ సందర్భంగా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవీ ఆంజనేయులు గారు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. ప్రతి తమ ఇల్లు, పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించి, నారసంచులను ఉపయోగించి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి నాయకులు నాగ శ్రీను రాయల్ గారు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.56 లక్షల జడ్పీ నిధులు
పార్టీ కార్యాలయంలో విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు2019 నుండి 2024 వరకూ జరిగిన విధ్వంసకర పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విమోచన కలిగి,అభివృధి వైపు పయనించే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రోజుగా జూన్ 4 వ తేదీని విజయోత్సవ దినంగా పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగింది.2024 జూన్ 4 వ తేదీన యావత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తీసుకున్న చారిత్రక నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ లు విజయోత్సవానికి గుర్తుగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేయడం జరిగింది.
నాదెండ్ల మండల నూతన అధికారిణి గా బాధ్యతలు నాదెండ్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో పి.సంతోషకుమారి మండల రెవిన్యూ ఇన్ స్పెక్టరు, గా బుధవారం బాధ్యదతలు స్వీకరించారు. ఈమె నిన్నటి వరకు వినుకొండ మండల తహశీల్దారు వారి కార్యాలయము నందు సీనియర్ సహాయకులుగా పనిచేసియున్నారు. పదోన్నతి పై సంతోషి కుమారి నాదెండ్ల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. పలువురు VRO లు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు









