పార్టీ కార్యాలయంలో విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు
2019 నుండి 2024 వరకూ జరిగిన విధ్వంసకర పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విమోచన కలిగి,అభివృధి వైపు పయనించే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రోజుగా జూన్ 4 వ తేదీని విజయోత్సవ దినంగా పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగింది.2024 జూన్ 4 వ తేదీన యావత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తీసుకున్న చారిత్రక నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విజయోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ లు విజయోత్సవానికి గుర్తుగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేయడం జరిగింది.

Share.
Leave A Reply