చిలకలూరిపేటలో సమర్త్ చేనేత ట్రైనింగ్ కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు
చిలకలూరిపేటలో చేనేతలకు ఉచితంగా సమర్త్ చేనేత కార్యక్రమం ప్రారంభం ఈరోజు చిలకలూరిపేట భావన ఋషి నగర్ లో చేనేత సమర్త్ ట్రైనింగ్ ప్రారంభించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు ( సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్) ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ చేనేతలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా స్కీంలు ప్రవేశపెట్టి 15% నుంచి 100% వరకు సబ్సిడీ చేనేతలకు అందిస్తున్నది చేనేతలకు వృత్తి నైపుణ్యం పెంపొందించి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు ట్రైనింగ్ 40 రోజులు జరుగుతునదని ట్రైనింగ్ అనంతరం వాళ్లకి ట్రైనింగ్ సర్టిఫికెట్స్ తొ పాటు వారికి 90% సబ్సిడీతో పరికరాలను అందిస్తారు,15% సిల్క్ అండ్ కాటన్ యారన్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత చేనేత ముద్ర రుణాలను అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వివర్స్ సర్వీస్ సెంటర్ టెక్నికల్ సూపర్నెంట్ బి స్వజిత్, వివర్స్ సర్వీస్ సెంటర్ జూనియర్ రామనాథం శ్రీను, సిడి మురళి బిజెపి చిలకలూరిపేట ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య మరియు కూటమి నాయకులు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



