పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో ప్రారంభమైన పల్నాడు జనతా వారిది కార్యక్రమం

రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రభుత్వానికి వారధి- బిజెపి జనతా వారధి
కార్యక్రమాన్ని శావల్యపురం మండలం, వేల్పూరు పంచాయతీ పరిధిలోని, వెలమవారిపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు కొన్ని సమస్యల్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ద్రుష్టికి తేవడం జరిగింది, ముఖ్యంగా దశాబ్దాలుగా పరిష్కారం కాని 45 ఎకరాల ఇనాం భూమిలకు సంబంధించి పాస్ పుస్తకాలు మంజూరు మరియు, రామాలయం ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మార్గంలో, వీధుల్లో సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, అలాగే పెన్షన్లకు సంబంధించి అలాగే మరికొన్ని పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది,
ఈ దరఖాస్తులను పరిష్కార పరిధని బట్టి ఆయా శాఖల పంచాయతీ, మండల, జిల్లా, రాష్ట్ర అధికారులకు ఇవ్వడం జరుగుతుంది, ఈ కార్యక్రమం ప్రతి గురువారం మండలంలోని ఒక గ్రామంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Share.
Leave A Reply