Author: chilakaluripetalocalnews@gmail.com

వైసీపీ ఒక ‘గొడ్డలి పార్టీ’.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీని “గొడ్డలి పార్టీ” గా అభివర్ణించారు. విలువలకు తిలోదకాలిచ్చి, హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శిస్తూ, ఆ పార్టీ అసలు స్వరూపం ఈరోజు తేటతెల్లమైందని మండిపడ్డారు.రాజీనామాలపై చైర్మన్ తీరుపై విమర్శలుతాము స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి, ఆమోదం కోసం మండలి చైర్మన్‌కు పత్రాలు సమర్పించినప్పటికీ, వాటిని తిరస్కరించడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించిన విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం నిబంధనలకు మరియు చట్టానికి విరుద్ధంగా ఉందని, స్వచ్ఛందంగా ఇచ్చిన రాజీనామాలను ఆమోదించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.ఈ పరిణామాలన్నీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసైగల్లోనే జరుగుతున్నాయని,…

Read More

పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా జిల్లా కార్యాలయంలో ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లపు కృపారావు గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభ ఉపన్యాసం చేసిన వల్లెపు కృపారావు గారు జనతా వారద కార్యక్రమం ప్రతి శుక్రవారం పల్నాడు జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని తమ సమస్యలపై వినతులు సమర్పించిన పిదప వాటి పరిష్కార కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అలాగే ప్రతి సోమవారం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మరియు జనత వారది కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి రెవెన్యూ కార్యాలయం వద్ద కూడా ప్రతి సోమవారం జనతా వారది కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈ సదవకాశాన్ని…

Read More

హెల్మెట్ ధరించని వారి దగ్గర అపరాధ రుసుము విధించిన ఎస్సై లేఖ ప్రియాంక వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై లేఖ ప్రియాంక అన్నారు. గురువారం చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల రహదారిపై వాహనాలను సిబ్బందితో కలిసి ఆమె తనిఖీలు చేపట్టారు. హెల్మెట్లు లేని 17 వాహనాల వద్ద రూ.10,185 జరీమాన విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనానికి సంబంధించి RC దగ్గర ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు తెలిపారు. పోలీసుల సలహాలు తీసుకొని ప్రమాదాలను నివారించాలని వాహనదారులకు ఎస్ఐ సూచనలు ఇచ్చారు.

Read More

శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈవారం జనతావారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండలంలోని వయ్యకల్లు గ్రామంలో నిర్వహించడం జరిగింది ,కార్యక్రమంలో నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది, ముఖ్యంగా పొలం బాటకు వెళ్లే రహదారి కొరకు, త్రాగు నీటిలో ఫ్లోరిన్ సమస్య పరిష్కారం కొరకు, సైడ్ డ్రైనేజీల మరమ్మతులు మరియు నిర్మాణం కొరకు, కిసాన్ సంబంధిది నిధులు కొరకు, దరఖాస్తులు రావడం జరిగింది, ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు, బిజెపి నేతలు అన్నవరపు శ్రీనివాసరావు, నార్ల సాంబశివరావు పాల్గొన్నారు.

Read More

భవన నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి: కలెక్టర్ పల్నాడులో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కార్మికులు సమీప కార్మికశాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు తప్పనిసరిగా నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. నమోదు చేసిన కార్మికులకు వివిధ సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

Read More

వినుకొండ పట్టణం లొ బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P V N మాధవ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల ప్రకారం మన వినుకొండ పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది.జనతా వారధి అనగా ప్రజల నుంచి సమస్యలు సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దాన్ని పరిష్కరించే కార్యక్రమమే ఈ జనతా వారధి .దీనిలో భాగంగా జరిగిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా గృహ సంపర్కం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కోవడం జరిగినది.అది వారం ఉదయం బోసు బొమ్మ దగ్గర ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో పూజా కార్యక్రమం పూర్తిచేసుకుని అక్కడి నుండి బొమ్మ మీదగా పప్పు బజార్ వరకు గృహ సంపర్కం చేయడం జరిగింది కార్యక్రమంలో…

Read More

మేడం రమేష్ పై హత్యాకు కుట్ర.. పల్నాడు జిల్లా,వినుకొండ: సీనియర్ నాయకుడు, వైశ్య ప్రముఖుడు, ప్రముఖ అపరాల వ్యాపారి మేడం రమేష్ పై హత్యకు కుట్ర పన్నారు. కుట్ర గుట్టు రట్టు కావడం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం వినుకొండ పోలీసులు క్రైమ్ నెంబర్ 91/2026, 506-308 సెక్షన్ల క్రింద ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన గొట్టం గోవిందరాజులు 2020లో లేని భూమిని ఉన్నట్టుగా చూపి అక్రమంగా జగనన్న కాలనీకి ప్రభుత్వానికి అమ్మి సుమారు 90 లక్షలు స్వాహా చేశారు. ఈ అవినీతిని మేడం రమేష్ బయటకు తీసి గత ఏడాది అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి నిగ్గు తేలింది. దీనితో కక్ష కట్టిన గొట్టం గోవిందరాజులు, B. వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి మేడం రమేష్ హత్యకు కుట్ర పన్ని సుపారి ఇచ్చి హత మార్చే ప్రయత్నం చేశారంటూ, తనకు…

Read More

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ గారు పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్.,జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,పల్నాడు జిల్లా విషయం:పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి. అమ్మ , భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో…

Read More

ఆర్డీవో గా డివిజన్ లో మంచి పేరు తీసుకురావాలి నరసరావుపేట డివిజన్ లో ప్రజలకు మంచి సేవ చేయాలని నూతన ఆర్డీవో బాలకృష్ణ ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాలకృష్ణ ఆదివారం చిలకలూరిపేట లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని , డివిజన్ కి మంచి పేరు తీసుకురావాలని ఆర్డీవో కు ఎమ్మెల్యే సూచించారు.

Read More

“పోదాం పోదాం సర్కారు బడికి పోదాం” నినాదాలతో అవగాహన ర్యాలీ చిలకలూరిపేట లోకల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు మేరకు ఈనెల 18నుంచి23వరకు పాఠశాల ఆవాస్ ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలను బడి బయట ఉండకుండా బడిలో చేర్చుకునే విధంగా బడిబాట ర్యాలీ నిర్వహించాలని అదేవిధంగా చదువు మధ్యలో ఆపేసిన డ్రాప్స్ తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా ఈ ర్యాలీ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు నూతన 2026-27విద్యా సంవత్సరంలో పాఠశాల ఆవాస ప్రాంతంలో బడి ఈడు కలిగిన పిల్లలందరూ బడిలోనే ఉండాలని బాల కార్మికులు కానీ నవ ఎన్రోల్మెంట్ గాని ఉండకూడదని ఉద్దేశంతో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పోదాం పోదాం -సర్కారు బడికి పోదాం,డబ్బులు ఎందుకు దండగ -సర్కారు బడి ఉండగా వంటి నినాదాలతో విద్యార్థులు పోలిరెడ్డి పాలెం లో బడిబాటర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ అడ్మిషన్ ప్రక్రియ…

Read More