పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

పల్నాడు జిల్లా జిల్లా కార్యాలయంలో ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లపు కృపారావు గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభ ఉపన్యాసం చేసిన వల్లెపు కృపారావు గారు జనతా వారద కార్యక్రమం ప్రతి శుక్రవారం పల్నాడు జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని తమ సమస్యలపై వినతులు సమర్పించిన పిదప వాటి పరిష్కార కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అలాగే ప్రతి సోమవారం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మరియు జనత వారది కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి రెవెన్యూ కార్యాలయం వద్ద కూడా ప్రతి సోమవారం జనతా వారది కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈ సదవకాశాన్ని కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు

అలాగే ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం కూడా జరిగింది. తదుపరి సంబంధిత ప్రభుత్వ అధికారులకు వాటిపై వివరణ అడిగి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆవుల ఆదినారాయణ బీజేపీ దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా బీజేవైఎం నాయకులు ఇమ్మడిశెట్టి అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు

Share.
Leave A Reply