ఆ పాఠశాల ఇకపై జిల్లా పరిషత్ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్– కొండవీడు యూపీ స్కూల్ హైస్కూల్‌గా ఉన్నతి– అలాగే ప్రైమరీ మోడల్ స్కూల్‌గా ఎంపిక– ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ..ఈ ఏడాది నుండే అమలు– ఆనందంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు– సమిష్టి కృషితోనే సాధించామని హెచ్ఎం జి శ్రీనివాసరావు వెల్లడి యడ్లపాడు మండలం కొండవీడు యూపీ పాఠశాల హైస్కూల్‌గా అప్గ్రేట్ అయింది. 2025–26 విద్యాసంవత్సరం నుండి హైస్కూల్ తరగతి బోధన ప్రారంభం కానున్నట్లు పాఠశాల హెచ్ఎం జి శ్రీనివాసరావు వెల్లడించారు. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో ప్రైమరీ మోడల్ స్కూల్ నిర్వహణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. సహుపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు పార్టీల కతీతంగా సహకారం అందించడంతోనే వీటిని సాధించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పలు అంశాలపై చర్చించిన మాజీ మంత్రి వర్యులు విడదల రజిని .
మంత్రి లోకేష్, బాలకృష్ణతో చీఫ్ విప్ జీవీ, మక్కెన సమావేశం రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనే యులు, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు. ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లిలో ఈ మేరకు వారిద్దర్ని కలిశారు. మంత్రి లోకేష్‌కు ఒక మొక్కను బహూకరించారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు వారిద్దర్ని ప్రత్యేక కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నామ ని, ఈ రోజు కుదరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలతో పాటు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగెత్తిన పూర్తి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు గారు అధికారులను ఆదేశించారు. స్థానిక వెల్లటూరు రోడ్‌లోని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం టిడ్కో ఇళ్ల ను మంజూరు చేసిందన్నారు. పెండింగ్ లో ఉన్న ఇండ్ల పనులను త్వరగా పూర్తిచేసి రోడ్లు డ్రైనేజీ విద్యుత్తు త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసుతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు కమిషనర్ గారు, అధికారులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మెగా వైద్య శిభిరాన్ని విజయవంతం చేయండి…. డాక్టర్ ముద్దన రమేష్ బాబు చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 29వ తేదీన శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఉచిత మెగా నేత్ర వైద్య సేవలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు, ఐ యం.ఏ. చిలకలూరిపేట అధ్యక్షులు డా. ముద్దన రమేష్ బాబు కోరారు. కార్పొరేట్ వైద్యాన్ని చిలకలూరిపేటకు తీసుకువస్తున్న పుల్లారావు సేవలు వెలకట్టలేనివన్నారు. కేవలం శుక్లాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్థారన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట పట్నంలోని 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ చిలకలూరిపేట పట్నంలోని 30 వ వార్డు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలను ప్రకటించిన సందర్భంగా మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని కలిసి పదవులు దక్కిన వారు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. 30 వ వార్డు లో పదవులు దక్కిన వారికి మాజీమంత్రి,శాసనసభ్యులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. 30 వార్డ్ లో పదవులు దక్కిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు
గురువారం (15.05.2025)టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, గౌరవ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి షెడ్యూల్ ఉదయం 9 గంటలకు.. కారంపూడిలో, శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం మండపంలో.. బొల్నేడి శ్రీనివాసరావు ( వేపకంపల్లి నాయకులు) గారి కుమార్తె వివాహం. ఉదయం 9.30 గంటలకు.. పిడుగురాళ్ల మండలం, గుత్తి కొండ గ్రామంలో,, బండ్ల వెంకటేశ్వర్లు గారి కుమారుడు వివాహం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం. ఉదయం 10 గంటలకు.. పిడుగురాళ్లలో.. జానపాడు వెళ్లే మార్గంలో.. ఆర్ఓబి శంకుస్థాపన. తర్వాత.. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో, చెట్టు దగ్గర, వీర్ల పిచ్చయ్య గారి కుమారుడు వివాహం సందర్బంగా హౌస్ విజిట్ పిడుగురాళ్ల మండలం, వీరాపురం గ్రామంలో.. గొడవర్తి రామకృష్ణ గారి కుమారుడి వివాహం సందర్బంగా హౌస్ విజిట్. తర్వాత పిడుగురాళ్ల పట్టణంలో, జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో,,, పబ్లిక్ గ్రీవెన్స్ పిడుగురాళ్ల పట్టణంలోని, మార్కెట్ యార్డ్ లో,, గురజాల నియోజకవర్గస్థాయి రివ్యూ…
మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని చిలకలూరిపేట లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.
31 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కూనపురెడ్డి రాజేంద్రప్రసాద్. మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 31 వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పర్యవేక్షణలో పురుషోత్తపట్నంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ లో 31 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కూనపురెడ్డి రాజేంద్రప్రసాద్. కూనపరెడ్డి రాజేంద్రప్రసాద్ కు పదవి దక్కడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు
రేపల్లె మున్సిపల్ ఆఫీస్ కు బదిలీ అయినా TPo సుజాత చిలకలూరిపేట:టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న కె.సుజాత కు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద ,, రేపల్లెకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ.









