జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ విద్య అమలు చేయాలి – పల్నాడు జిల్లా కలెక్టర్ కి APUWJ జర్నలిస్టుల వినతి. వెంటనే స్పందించిన కలెక్టర్ విద్య శాఖ అధికారులు కు ఆదేశాలు జారీ పల్నాడు జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి — నిస్వార్థంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు (APUWJ) పేర్కొన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50%ఫీజు రాయితీ విద్యను కల్పించేందుకు ఈ అంశంపై పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కు వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి కలెక్టర్ వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లావిద్యా శాఖ అధికారులకు 50%ఫీజు రాయితీ పై ఆదేశాలు ఇచ్చారు . ఈ విషియం పై పల్నాడు జిల్లా APUWJ నాయకులు హర్షం వ్యక్తం చేసి జర్నలిస్ట్…
Author: chilakaluripetalocalnews@gmail.com
గుడిలో సీసీకెమెరాల ధ్వంసంపై కేసు నమోదు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగిన యడ్లపాడు పోలీసులు ఠానాలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు యడ్లపాడుమండలంలింగారావుపాలెంలో గ్రామదేవత గుడిలో సీసీ కెమెరాల ధ్వంసంపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని గంగమ్మ తల్లి గుడిలో ఇటీవల కొలుపులు నిర్వహించారు. అయితే వీటకి సంబంధించి కొందరు ఈనెల 2వ తేదీన గుడిలో దీపారాధన చేశారు. ఈ విషయంపై సదరు గుడికి చెందిన మరికొందరితో దీపారాధన చేసిన వారితో వాగ్వాదం జరిగింది. ఇదే తరహాలో గతంలోనూ ఒకమారు వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి సఖ్యత చేసి పంపించినా ఫలితం లేకపోవడం, ఆ తర్వాత గుడిలో సీసీకెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు రంగవల్లులు అందంగా తీర్చి దిద్దిన మహిళలు సుపరిపాలన పేరు తో వేడుకలు ఘనంగా నిర్వహించిన జనసేన సుపరిపాలన మొదలయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రికొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రామాలలో, వాడ వాడలలో ప్రజలు స్వచ్ఛందంగా వేడుకలు నిర్వహించి, సంక్రాంతి ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలలో స్థానిక సమన్వయకర్త తోట రాజా రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా, ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. గడిచిన వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలు అణిచివేతకు గురయ్యారని వారి ఆర్థిక స్థితిగతులు క్షీణించాయని, తీవ్ర నిరాశకు గురై గడిచిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి పార్టీలకు 164 స్థానాలు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని…
పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గ. రాజుపాలెం మండలం దేవరంపాడు అద్దంకి-నార్కట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం… అతివేగంతో బైకును ఢీకొట్టిన కారు… బైక్ పై ప్రయాణిస్తున్న నెమలిపురి గ్రామానికి చెందిన కంకణంపాటి నరసయ్య(50)అక్కడికక్కడే మృతి… కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు…. క్షతగాత్రుడ్ని నరసరావుపేట లోని ప్రవేటు వైద్యశాలకు తరలింపు… మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు… కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు…
పల్నాడు: వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం కార్యక్రమం వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ర్యాలీ, చేయనీయకుండా మరియు నాయకులు మాట్లాడనీయకుండా మైక్ ను అడ్డుకున్న పోలీసులు
పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారు నేడు (04.06.2025) వెల్దుర్తి గ్రామాన్ని సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారంపై దాఖలైన ఫిర్యాదుల (PGRS) నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై గ్రామస్థులతో ప్రత్యక్షంగా చర్చించారు.
విధ్వంస పాలనకు ప్రతిస్పందనగా గత ఏడాది ఇదే రోజు ప్రజా చైతన్యానికి నాంది. చరిత్ర తిరగరాసిన ప్రజా తీర్పు.. గత సంవత్సరం ఇదే రోజున కూటమి ప్రభుత్వం, నన్ను నాలుగవ సారి మీ ఆదరణతో భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ పంపారు. అది కావటం ఓటు కాదు.. మీ విశ్వాసం, మద్దతు, ప్రేమ, ఆశీర్వాదం! మీ నమ్మకానికి విలువనిచ్చేలా పనిచేయడం నా బాధ్యత, నా కర్తవ్యంగా భావస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతాను.ప్రతి క్షణం, ప్రతి అడుగు – ప్రజల కోసం, ప్రగతి కోసం..
పాత గవర్నమెంట్ హాస్పటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన నాయకులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ప్రభుత్వ చిన్న పిల్లల హాస్పిటల్ సాధన అఖిలపక్ష కమిటీ సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట టౌన్ :చిలకలూరిపేట పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ చిన్నపిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ హాస్పటల్ సాధన అఖిలపక్ష కమిటీ నాయకులు సోమవారం సాయంత్రం మాజీమంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు షేక్ జమాల్ బాషా, అధ్యక్షులు చేవూరి కృష్ణమూర్తి, కార్యదర్శి నాయుడు శివకుమార్, కమిటీ నాయకులు పేలూరి రామారావు, నాగభైరు రామసుబ్బాయమ్మ, మాదాసు భాను ప్రసాద్, రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణ యాదవ్, కొప్పురావురి…
జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ యోగా స్పూర్తి తో వికసించింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు…









