చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.

రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం!

-మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లకు చెందిన ఆదినారాయణ,తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు మందు తాగి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆదినారాయణ,గోపాలరావుల భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు,ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు,రైతులు పండించిన ఏ పంటకు కనీసం గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది,రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం..మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యాడికి వెళ్లి మిర్చికు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు మరియు పొదిలి వెళ్లి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పొగాకు రైతుల బాధను చూశారు,ప్రభుత్వం అన్ని విధాల విఫలం అయిపోయింది,ప్రజా సమస్యలన్నిటిని గాలికి వదిలేసి కేవలం రెడ్బుక్ పైనే దృష్టి పెట్టింది ఈ ప్రభుత్వం..ఈ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది…రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై దాడులు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి,సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టు కట్టేయడం దారుణం,మహిళల పైన లైంగిక దాడులు దాడులు హత్యలు పెరిగిపోయాయిచివరకు మహిళల డెడ్ బాడిలు కూడా కనిపించిన పరిస్థితి ఉందని ఆమె అన్నారు

Share.
Leave A Reply